Mahesh Babu: మహేష్ ఫిజిక్.. ఆ విషయంలో రాజమౌళి అసంతృప్తి..!

మహేష్ బాబు (Mahesh Babu)  – రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ అధినేత కె.ఎల్.నారాయణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజమౌళి- మహేష్ – కె.ఎల్.నారాయణ్ (K.L.Narayana).. లు అలాగే రైటర్ విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad).. పలు సందర్భాల్లో ఈ ప్రాజెక్టు గురించి చెప్పడమే కానీ.. అధికారికంగా ఇంకా అనౌన్స్ చేసింది అంటూ ఏమీ లేదు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజుకైనా అధికారిక ప్రకటన వస్తుందేమో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరోపక్క ముంబైలో టెస్ట్ షూట్లు వంటివి నిర్వహిస్తున్నారు రాజమౌళి అండ్ టీం. విక్రమ్ (Vikram), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) వంటి వారు ఈ ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం ఉంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాలని టీం భావిస్తుంది. దానికి తగ్గట్టే వర్క్ షాప్స్ వంటివి కూడా ప్లాన్ చేసింది. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు ఈ సినిమాలో చాలా రఫ్ లుక్ లో కనిపించాల్సి ఉంది. అందుకు తగ్గట్టు హెయిర్, గడ్డం..ని పెంచాడు.

తాజాగా అనంత్ అంబానీ వెడ్డింగ్ లో మహేష్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. మహేష్ విషయంలో ఒక్కటే లోటు అని రాజమౌళి భావిస్తున్నాడట. అదేంటి అంటే.. మహేష్ కండలు తిరిగిన దేహంతో ఈ అడ్వెంచరస్ డ్రామాలో కనిపించాలి. మొదటిసారి ఈ సినిమాలో మహేష్ బాబు షర్ట్ విప్పి 6 ప్యాక్ లేదా 8 ప్యాక్ లో కనిపించాల్సి ఉంది.

టీ షర్ట్ వేస్తే..కండలు కనిపించాలి. కానీ మహేష్ బాబు ఆ రేంజ్లో బైసెప్స్ డెవలప్ చేయలేకపోతున్నట్టు ఇన్సైడ్ టాక్. దీంతో మరో ట్రైనర్ ని పెట్టుకొని ఫుడ్ మెనూ అంతా మార్చుకోవాలని రాజమౌళి అతనికి సూచించినట్టు ఇన్సైడ్ టాక్. లేదు అంటే.. డూప్ ని ఎక్కువ సీన్స్ లో వాడుకోవాల్సి ఉంటుంది అని కూడా రాజమౌళి… మహేష్ కి గుర్తుచేశాడట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus