Daaku Maharaaj: డాకు మహరాజ్.. స్టోరీ లైన్ ఇదేనా?

నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న డాకు మహారాజ్ (Daaku Maharaaj) చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. బాబీ (Bobby)  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో మరో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. లేటెస్ట్ లీక్స్ ప్రకారం, ఈ సినిమా బలమైన రివెంజ్ డ్రామాగా ఉంటుందని సమాచారం.

Daaku Maharaaj

ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ లో చాందినీ చౌదరి (Chandini Chowdary)  పాత్ర కీలకంగా ఉంటుందని, బాలకృష్ణ గెటప్ అలాగే మేనరిజమ్స్ ఈ ట్రాక్‌లో కొత్తగా కనిపించబోతున్నాయని టాక్. బాలయ్య పాత్ర ఒక ప్రభుత్వాధికారిగా మొదలై, ఎందుకు డాకు మహారాజ్‌గా మారాడనేది కథలో ప్రధాన మలుపుగా చెప్పబడుతోందట. బాబీ ఈ కథను పవర్‌ఫుల్ యాక్షన్ బ్లాక్స్‌తో మిక్స్ చేసినట్లు సమాచారం. వాల్తేరు వీరయ్యతో (Waltair Veerayya) బాబీ ఏ రేంజ్ ఎమోషనల్ కనెక్షన్ చూపించాడో తెలిసిందే.

అదే తరహాలో, డాకు మహారాజ్‌లో రివెంజ్ డ్రామాను పీక్స్‌కి తీసుకెళ్లేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఐదు ప్రధాన యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని, వీటిలో రెండు ఫ్లాష్‌బ్యాక్‌లోనే ఉంటాయని నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) వెల్లడించారు. డాకు అనే టైటిల్‌కు సరైన న్యాయం చేయడానికి కథలో థ్రిల్లర్ తీరుతో కూడిన సన్నివేశాలను సైతం చేర్చారని టాక్. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath)  , ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) , ఊర్వశి రౌతేలా నటిస్తున్నారు.

బాబీ డియోల్ ప్రధాన విలన్‌గా కనిపించబోతున్నారు. తమన్  (S.S.Thaman) సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చనుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు డాకు మహారాజ్ టఫ్ కాంపిటేషన్ ఇవ్వనుందని అంచనా. బాలయ్య అభిమానులు ఈ సంక్రాంతి పండగను మాస్ ట్రీట్‌గా మార్చుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ ద్వారా మరింత బజ్ క్రియేట్ చేయనున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus