బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోకి వచ్చి రామ్‌చరణ్ సందడి చేసిన విషయం తెలిసిందే. రెండు భాగాలు రూపొందించిన ఈ కర్యక్రమంలో తొలి ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతోంది. అందులో ‘గేమ్ ఛేంజర్’ గురించి, ఆ సినిమా గురించి చరణ్ పడ్డ కష్టం గురించి నిర్మాత దిల్ రాజు గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో చరణ్ ఓ సినిమాను తమ కోసం వదులుకున్నాడు అని దిల్ రాజు గొప్పగా చెప్పారు.
ఆ మాట విన్నప్పటి నుండి చరణ్ వదులుకున్న సినిమా ఏంటి? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. రీసెంట్ టైమ్స్‌లో చరణ్ విన్న కథలేంటి, వదిలేసిన సినిమాలు ఏంటి అని ఫ్యాన్స్ లెక్కలు కట్టేస్తున్నారు. ఈ క్రమంలో చాలామందికి గుర్తొస్తున్న సినిమా గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్. అవును ఆ సినిమా అంతా ఓకే అనుకున్నాక వెనక్కి వెళ్లిపోయారు. అప్పుడు ఏవేవో కారణాలు చెప్పినా ఇప్పుడు దిల్ రాజు వేరే మాట అంటున్నారు.
రామ్‌చరణ్ 16వ సినిమా బుచ్చిబాబు సానా ప్రాజెక్ట్‌ను ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా అయింది. అయితే ఆ నెంబరు గతంలో వేరే సినిమాకు ఇచ్చారు. అదే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్. చాలా రోజుల పాటు ఈ సినిమా గురించి పని చేసిన గౌతమ్ హఠాత్తుగా సినిమా పనులు ఆపేశారు. ఏమైంది అంటే వద్దనుకున్నాం అని షార్ట్‌గా చెప్పేశారు. ఇప్పుడు ఆ పరిస్థితిని దిల్ రాజు వాడుకున్నారా? లేక నిజంగా చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసమే నో చెప్పడా అనేది తెలియాలి.
ఇక చరణ్ వదిలేసిన సినిమను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌లో విజయ్ ఉన్నాడు. మరి సినిమా వచ్చాకనే అసలు విషయం తెలుస్తుంది. వదిలేసి మంచిదైందా లేక తప్పు జరిగిందా అని. ఈ సినిమా మార్చి 28న వస్తుంది అని సమాచారం. అంటే మరో 80 రోజులు ఉందన్నమాట.