Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!
- October 27, 2026 / 11:31 AM ISTByFilmy Focus Desk
ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఓ టాక్ షో చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’షోను నిర్వహించిన బీవీఎస్ రవి ఈ షోను హ్యాండిల్ చేస్తారు అనేది అప్పట్లో వచ్చిన ఆ వార్తల సారాంశం. అయితే ఆ బజ్ వచ్చాక చాలా రోజులుగా ఎవరూ దాని గురించి మాట్లాడుకోలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఆ టాక్ షో గురించి ఓ చర్చలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దానికి కారణం ఆ షోకి ఓ పేరు అనుకున్నారని వార్తలు రావడమే.
Chiranjeevi
చిరంజీవి తొలిసారిగా ఓటీటీలోకి వస్తుండటం.. అందులోనూ ఇప్పుడు హీరోలు అందరూ ఓటీటీకి వస్తున్నారు, చిరంజీవి ఒక్కరే రాలేదు అనే మాటలు వినిపిస్తుండటంతో ఆ షో మీద అందరి దృష్టీ పడింది. అందులోనూ స్టార్ హీరోల టాక్ షోకి ‘అన్‌స్టాపబుల్’ ఓ బెంచ్ మార్క్‌గా నిలవడంతో చిరు షో ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుండటంతో మేకింగ్, క్వాలిటీ, గ్రాండియర్, రీచ్ విషయంలో ఎలాంటి ఆలోచనా అక్కర్లేదు. అందుకే ఈ షో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఈ షోకు ‘మెగా వెర్స్’ అనే పేరు పెడుతున్నారట. అంటే మెగా లోకం అనుకోవచ్చు. ఆయన లోకంలోకి వచ్చే గెస్ట్‌లు ఎవరు, ఆయన మాట్లాడించి చెప్పించే విషయాలేంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ షోను ఆయన పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నారట. ఆమె బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ మీదనే ఈ షో రన్ అవుతుంది. అయితే గతంలో అనుకున్నట్లు బీవీఎస్ రవి హ్యాండిల్ చేస్తారా? లేక వేరే ఎవరైనా వస్తారా అనేది చూడాలి.
అన్నట్లు ఈ షోలో కేవలం సినిమా వాళ్లే కాకుండా.. ఇతర రంగాల్లోని ముఖ్యులు కూడా గెస్టులుగా వస్తారట. మరి వారితో చిరంజీవి ఎలా సందడి చేస్తారనేది చూడాలి. త్వరలో ఈ షో లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం.
















