Rajamouli: మహేష్‌ సినిమా తర్వాత రాజమౌళి ఆ హీరోతో సినిమా చేస్తారా?

  • January 5, 2024 / 01:16 PM IST

‘బాహుబలి’ సినిమాల తర్వాత రాజమౌళి ఏ నిర్మాతకు సినిమా చేస్తారో అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే ఆయనతో సినిమా చేయడానికి ఎంతోమంది అగ్ర నిర్మాతలు, బాలీవుడ్‌ నిర్మాతలు కూడా సిద్ధమయ్యారు. అయితే ఆయన మాత్రం డీవీవీ దానయ్యకు సినిమా చేశారు. ఆయనకే సినిమా ఎందుకు? అనే ప్రశ్న ఆ సమయంలో వినిపించింది. దానికి సమాధానం ఎప్పుడో రాజమౌళికి దానయ్య అడ్వాన్స్‌ ఇచ్చారని… అందుకే చేశారని. అయితే ఇప్పుడు మరోసారి అదే పని చేయబోతున్నారా?

నిజానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి సినిమా ఏ ప్రొడక్షన్‌ హౌస్‌లో అనే మాట రాగానే అప్పటిలాగే చాలా పెద్ద సంస్థల పేర్లు వచ్చాయి. కానీ అప్పుడు కూడా ఆయన ఓ పాత అడ్వాన్స్‌కి సినిమా ఓకే చేశారు. అదే మహేష్‌ బాబు సినిమా. గతంలో అగ్ర నిర్మాతగా పెద్ద పెద్ద సినిమాలు చేసిన కేఎల్‌ నారాయణ ఇప్పుడు సినిమా నిర్మాణంలో యాక్టివ్‌గా లేరు. కానీ అప్పుడు ఇచ్చిన అడ్వాన్స్‌ ఇంకా ఉండటంతో (Rajamouli) రాజమౌళి – మహేష్‌ సినిమా ఆయన బ్యానర్‌లోనే తెరకెక్కబోతోంది.

అయితే, తాజాగా మరో సినిమా విషయం ఇలానే బయటకు వచ్చింది. మహేష్‌ సినిమా తర్వాత జక్కన్న ఎవరితో సినిమా చేస్తారు అనేదే ప్రశ్న. దీనికి సమాధానం ‘పాత అడ్వాన్సే’ అంటున్నారు. ‘మగధీర’ సినిమా తరవాత సూర్యతో ఒక సినిమా చేయాలని రాజమౌళి అనుకున్నారు. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ సినిమా అప్పుడు ఓకే అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమాను చేసేద్దాం అనుకుంటున్నారట. అయితే దీనికి నిర్మాత ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

సూర్య దగ్గర వ్యక్తులకే ఈ నిర్మాణ అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సూర్యతో సినిమా చేస్తే అది అన్నదమ్ముల ఇద్దరితోనూ ఉంటే బాగుంటుంది అనేది అభిమానుల కోరిక. ఇక పాన్‌ ఇండియా స్థాయిలోనే ఆ సినిమా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus