Akira Nandan: మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో అకీరా ఎందుకలా చేశాడు?

ఏటా జరిగేటట్టుగానే ఈ ఏడాది కూడా మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీ కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్‌ ఘనంగా జరుపుకున్నాయి. ఈ సారి కుటుంబంలోకి ఇద్దరు అమ్మాయిలు కొత్తగా రావడం, అందులోనూ వారు చాలా స్పెషల్‌ అవ్వడంతో ఇంకాస్త ఘనంగా జరుపుకున్నారు అని చెప్పాలి. ఈ మేరకు ఆ ఫ్యామిలీ వాళ్ల సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్న ఫొటోలు, వీడియోలు చూస్తే చెప్పేయొచ్చు. అలా బయటకు వచ్చిన ఓ వీడియో ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు.

అదేంటి, పవన్‌ కల్యాణ్‌ ఈ కుటుంబ వేడుకలకు రాలేదు కదా అనుకుంటున్నారా? ఆయన రాకపోతేనేం ఆయన పెద్ద కొడుకు అకీరా నందన్‌, పెద్ద కూతురు ఆద్య వచ్చారు కదా. వాళ్ల ఫొటోలు చూసి పవన్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. దాంతోపాటు అకీరా ప్లే చేసిన పాట గురించి కూడా ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అకీరా ప్లే చేసిన మ్యూజిక్‌ బయటకు రాలేదు కానీ… ఆ పాట మాత్రం ‘యానిమల్‌’ సినిమాలోని ‘పాపా మేరీ జాన్‌..’ అనే పాటనే అని చెబుతున్నారు.

మెగా సెలబ్రేషన్స్‌లో వంటలు, భోజనాలు, పాటలు, డ్యాన్స్‌లు కనిపించాయి. అయితే ఈ సారి స్పెషల్‌ (Akira Nandan) అకీరా ప్లే చేసిన పియానో మ్యూజిక్‌. ఉపాసన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేశారు. అకీరా కూడా అదే పోస్ట్ చేశాడనుకోండి. అయితే, ఆ వీడియోను పోస్ట్ చేస్తూ అకీరా వాయించిన ట్యూన్‌ కాకుండా ‘యానిమల్’ సినిమాలోని నాన్న పాట బీజీఎం పెట్టారు. టెక్నికల్‌ ఇష్యూ కారణంగాన అకీరా ప్లే చేసి ఆడియో షేర్‌ చేయలేకపోయా అని కూడా ఉపాసన చెప్పారు.

మామూలుగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో పవన్‌ పాల్గొనడం చాలా అరుదు. పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ఉంది. దీంతో మరీ వచ్చే అవకాశం లేదు. అయితే తండ్రిని గుర్తు చేసుకుంటూనే అకీరా ఇప్పుడు నాన్న పాట ప్లే చేశాడు అని చెబుతున్నారు. దీంతో ఫ్యాన్స్‌ అయితే అకీరా చేసిన పనికి ఖుష్ అవుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus