Rajinikanth: రజనీ అంత అర్జెంట్‌గా వస్తోంది.. ఆ స్టార్‌ హీరో కోసమేనా? తప్పనిసరి పరిస్థితా?

స్టార్‌ యాక్టర్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ఇటీవల అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. హార్ట్‌లో స్టెంట్‌ వేశారు, ఇప్పుడు అంతా ఓకే అని కుటుంబ సభ్యులు, వైద్యులు చెప్పారు కూడా. అయితే మొన్నీమధ్యే శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వెంటనే షూటింగ్‌లో ఎందుకు పాల్గొంటున్నట్లు అనేదే ప్రశ్న. అంటే ఈ నెల 16 నుండి రజనీ తిరిగి సెట్స్‌లోకి వస్తారు అని ‘కూలీ’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ చెప్పారు. రెస్ట్‌ ఇన్ని తక్కువ రోజులా అనే ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.

Rajinikanth

అదే.. కొత్త షెడ్యూల్‌ షూట్‌ చేయబోతున్న సీన్స్‌. సినిమాకు ఆ సీన్స్‌ చాలా కీలకమని, అండ్‌ అందులో నటించబోయే నటుల డేట్స్‌, కాంబినేషన్స్‌ మళ్లీ కుదరడం అంత ఈజీ కాదు అని అంటున్నారు. ఎందుకంటే ఈ నెల 16 నుండి జరగనున్న చిత్రీకరణలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ నటించబోతున్నారు అని టాక్‌. ‘కూలీ’ సినిమాలో ఆమిర్‌ నటిస్తాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

‘ఖైదీ’, ‘విక్రమ్‌’, ‘లియో’ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్న దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ప్రస్తుతం రజనీతో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్టార్స్‌తో నిండిపోతోంది. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర ఇలా స్టార్లు ఒకవైపు.. సత్యరాజ్‌, సాబిన్‌ షాహిర్‌ లాంటి విలక్షణ నటులు ఒకవైపు సినిమాలో భాగమయ్యారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌లో వీళ్లంతా ఉండబోతున్నారట.

ఇలాంటి కాంబినేషన్‌, డేట్స్‌ మళ్లీ కష్టం కాబట్టి రజనీకాంత్‌ సినిమా షూట్‌లోకి వచ్చేస్తున్నారు అని చెబుతున్నారు. నిర్మాత నష్టపోకుండా, సినిమా మీద ప్రభావం పడకుండా ఈ ఏర్పాటు అని చెబుతున్నారు. తలైవా షూటింగ్‌కి వస్తే కచ్చితంగా అప్‌డేట్‌ విత్‌ ఫొటో ఇస్తారు. సో వెయిట్‌ అండ్‌ సీ. అన్నట్లు కూలీ సినిమా లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం కాదు అని లోకేశ్‌ ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు.

ఆ సినిమా సెట్‌కి బాలయ్య ఎందుకెళ్లాడబ్బా.. ఏంటి స్పెషల్‌ న్యూసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus