స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో సినిమా ఇది. ఈ సినిమా కథకి సంబంధించిన ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల సారాంశం ఏంటంటే.. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసినప్పుడు దర్శకుడు సుకుమార్ కి, ఎన్టీఆర్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ తన బాల్యం, యవ్వనంలో విషయాలు, ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారట. వాటి స్ఫూర్తితోనే ‘పుష్ప’ కథకు బీజం పడిందని తెలుస్తోంది.
‘పుష్ప’ సినిమాలో హీరో తండ్రి ఆదరణకు దూరంగా పెరుగుతాడని, రెండో భార్య కొడుకు అని.. దాంతో కసిగా పెరిగి.. తోటివారు అందరినీ జయించి.. ఓ స్టేజ్ కి వస్తాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలా ఓ స్టేజ్ కి వచ్చిన తరువాత తన చిన్నతనంలో మిస్ అయిన భోగం, రాయల్ లైఫ్ ని సెకండ్ హాఫ్ లో చవిచూస్తాడట. సినిమా తొలిభాగం మొత్తం అడవుల్లో ఉంటుందని.. సెకండ్ హాఫ్ అత్యంత విలాసవంతంగా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ గాసిప్ లో ఎంతవరకు నిజముందనే విషయం మాత్రం సినిమా రిలీజ్ అయితేనే కానీ తెలియదు.
ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ హిందీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘పుష్ప’ను పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరున్న ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!