సీనియర్ హీరోలకు అన్యాయం చేస్తున్నారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ ఇద్దరు సీనియర్ హీరోలను కావాలనే అవమానిస్తుందని అంటున్నారు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్. వచ్చే ఏడాది సంక్రాంతికి సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’, నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ థియేటర్స్ దక్కకుండా చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.

సంక్రాంతి బరిలో దిగుతున్న సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని సి.కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలు చేస్తున్న ఇద్దరు సీనియర్ అగ్రహీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ అవమానిస్తుందని మండిపడ్డారు. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు వెంటనే స్పందించాలని కోరారు. పండగ సీజన్ లలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే రూల్ కి కట్టుబడి ఉండాలని చెప్పారు.

రెండు రాష్ట్రాల్లో పెద్ద పండగల సమయంలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని.. డబ్బింగ్ సినిమాలకు ఇవ్వకూడదనే నిర్ణయాన్ని ఇదివరకే తీసుకున్నామని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తెలుగు నిర్మాతల మండలి ఎగ్జిబిటర్లకు ఈ విషయంలో విజ్ఞప్తి చేసిందని.. ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిందని అన్నారు. తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ముందు వాళ్ల సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కదా అని అన్నారు సి.కళ్యాణ్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus