Trisha: మరోసారి త్రిష పెళ్లి టాపిక్‌.. ఈ సారి కొత్త ఫొటోతో చర్చ.. నిజమేంటి?

కొంతమంది హీరోయిన్లు వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామరస్‌గా తయారవుతారు. వాళ్ల సినిమాలకు ఆ వయసులో కూడా ఆదరణ ఉంటుంది. ఈ స్టేట్‌మెంట్‌ మీకు నమ్మశక్యంగా లేదా? అయితే మీరు స్టార్‌ హీరోయిన్‌ త్రిషను (Trisha)  ఈ సమయంలో పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పాలి. ఎందుకంటే 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న 40 ఏళ్ల భామ త్రిష. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతలా ప్రేక్షకుల్ని అలరించింది ఇప్పుడూ అంతే ఆకట్టుకుంటోంది. ఇప్పుడు వరుస సినిమాలు కూడా చేస్తోంది.

Trisha

ఈ విషయం అటుంచితే ఆమె మరో విషయంతో ఎప్పుడూ వార్తలో ఉంటుంది. అదే ఆమె పెళ్లి. గతంలో ఓసారి ఆమె నిశ్చితార్థం చేసుకొని పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. అయితే అంతకంటే ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు, రిలేషన్షిప్‌ పుకార్లు చాలానే వచ్చాయి. కొన్నేళ్ల క్రితం కూడా ఆమె నిశ్చితార్థం, పెళ్లి కూడా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కొన్నేళ్లుగా ఆమె గురించి ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇదే జరిగింది. ఈసారి ఆమె షేర్‌ చేసిన ఓ ఫొటో, దానికి పెట్టిన పాటే కారణం.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్రెడిషినల్ శారీ లుక్‌లో ఫొటో షేర్ చేసింది. ఆకుపచ్చ రంగు చీరలో అందంగా కనిపించింది. శారీ కలర్‌కు మ్యాచింగ్‌గా నెక్లెస్, చేతికి ఉంగరంతో అదిరిపోయింది. చూస్తుంటే అదేదో సినిమా సెట్స్‌లో తీసిన ఫొటోలా కనిపించడం లేదు. ఆ విషయం పక్కన పెడితే ఆ ఫొటోలకు ‘ఎల్లప్పుడూ ప్రేమ గెలుస్తుంది’ అని క్యాప్షన్ పెట్టింది. అంతేకాదు ఆ ఫొటోలకు పెట్టిన పాట కూడా ఆసక్తికరంగా ఉంది.

‘స్నేహితుడా స్నేహితుడా’ అనే పాట బీజీఎంను ఆ ఫొటోను అటాచ్‌ చేసింది. దీంతో ఆమె తన స్నేహితుడినే పెళ్లి చేసుకుంది అని కొందరు. కాదు కాదు ఎంగేజ్‌మెంట్‌ అయిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె నుండి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ఇక త్రిష సినిమాల సంగతి చూస్తే.. చిరంజీవి(Chiranjeevi)  ‘విశ్వంభర’(Vishwambhara)తో పాటు అజిత్ (Ajith)  ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ( Good Bad Ugly), కమల్ హాసన్ (Kamal Haasan)  ‘థగ్ లైఫ్’ (Thug Life) , సూర్య 45 (Suriya), మోహన్ లాల్ (Mohanlal) ‘ ‘రామ్’ సినిమాలు చేస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus