Trivikram: త్రివిక్రమ్ హైదరాబాద్లో ఉండటం లేదా…? ఏం జరుగుతుంది?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) సినిమాలు తగ్గిస్తున్నారా? ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా త్రివిక్రమ్ రెండేళ్ళకి ఒక సినిమా అన్నట్టు చేస్తారు. అది కూడా ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లోనే చేస్తారు. దాని చిన సంస్థ అయినటువంటి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో రూపొందే సినిమాలకి స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేస్తూనే సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంతకు మించి బయట సినిమాలకు ఆయన పని చేయాలంటే అది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా అయ్యుండాలి.

Trivikram

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ లో చేసిన ‘బ్రో’ (BRO) ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. త్రివిక్రమ్ సినిమాలు తగ్గిస్తున్నారు అనే ప్రచారం ఎందుకు జరుగుతున్నట్టు? అంటే దాని వెనుక ఒక కథ ఉంది. ఇటీవల మహా కుంభమేళలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కలిసి త్రివిక్రమ్ కూడా కనిపించారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్. సినిమాలకి కలిసి పనిచేస్తారు.

ఇప్పటివరకు అందరికీ తెలిసింది, అందరూ మాట్లాడుకునేది ఇదే. కానీ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీకి పరోక్షంగా త్రివిక్రమ్ చాలా పనులు చేసి పెడతారు అనేది మరో టాక్. అంతేకాదు రీ- ఎంట్రీలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు, వాటి పారితోషికాల్లో కొంత మొత్తాన్ని త్రివిక్రమ్ కి ఇచ్చారట పవన్ కళ్యాణ్. దీంతో ‘ఫార్చ్యూన్ ఫోర్’ అనే బ్యానర్ ను తన భార్య సౌజన్య పేరుపై స్థాపించి.. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో సినిమాలు చేస్తూ వస్తున్నారు త్రివిక్రమ్.

ఇందుకు గాను ఆయన 40 శాతం లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారట. మరోపక్క ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కువగా ఉండటం లేదట. వారంలో 4 రోజులు ఆయన అమరావతిలోనే ఉంటున్నారట. ‘జనసేన’ పార్టీకి సంబంధించిన పనుల్లో ఆయన కూడా పాలు పంచుకుంటున్నారు అని వినికిడి. అలాగే అమరావతిలో ఇప్పటికే ఆయన భూములు కూడా కొనుగోలు చేసినట్టు టాక్ నడుస్తుంది. పరోక్షంగా త్రివిక్రమ్ రాజకీయాల్లో బాగా బిజీగా ఉంటున్నారు అని వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus