Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ మళ్లీ ఆ సినిమాకు డేట్స్‌ ఇచ్చారా? కొత్త షెడ్యూల్‌ అప్పుడేనా?

పవన్‌ కల్యాణ్‌ సినిమాల కొత్త షెడ్యూల్ ఇప్పట్లో ఉంటుందా? ఇదేం ప్రశ్న.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్‌ ఉంది కదా? ఎన్నికలు ముందు పవన్‌ సినిమాలకు బ్రేక్‌ ఇస్తాడు.. ఇప్పుడు కాదు అని స్టాక్‌ ఆన్సర్‌ చెబుదాం అనుకుంటున్నారా? మీరు చెప్పింది నిజమే. అయితే ఇది గతనెలాఖరు వరకే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నికల బరిలోకి దిగాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు 35 మంది అభ్యర్థుల లిస్ట్‌ను కూడా విడుదల చేసింది.

అంటే ఈ ఎన్నికలను కూడా పార్టీ సీరియస్‌గా తీసుకుంది. మరి ఆయా ప్రాంతాల్లో అధ్యక్షుడిగా పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేయాలి. తెలంగాణలో ఎన్నికలకు 45 రోజులు మాత్రమే ఉంది. వాళ్లకు బీఫారాలు ఇవ్వాలి, ప్రచారం చేయాలి, మీటింగ్‌లు, మంతనాలు ఇలా చాలానే ఉన్నాయి. అసలు ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనే డౌట్‌ రావొచ్చు. కారణం ఏంటంటే పవన్‌ కొత్త షెడ్యూల్స్‌ కోసం డేట్స్‌ ఇచ్చారని వార్తలు రావడమే. అసలు సాధ్యమైనా ఇప్పుడు షూటింగ్‌లు అనే డౌట్‌ అందుకే వచ్చింది.

హరీశ్‌ శంకర్‌ – మైత్రీ మూవీ మేకర్స్‌ కాంబోలో పవన్ కల్యాణ్‌ (Ustaad Bhagat Singh) ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సుజీత్‌ – డీవీవీ కాంబలో ‘ఓజీ’ చేస్తున్నాడు. ఈ సినిమాల కొత్త షెడ్యూల్స్‌ ఈ నెల మూడు, నాలుగు వారాల్లో ఉంటాయి అని ఇటీవల టాక్‌ వచ్చింది. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’కి అయితే ఈ నెల 20 నుండి డేట్స్‌ ఇచ్చారనే టాక్‌ ఒకటి ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీంతో ఆ రోజు షూటింగ్‌ ఉంటుందా? వాయిదా వేస్తారా అనే డౌట్‌ మొదలైంది.

అలాగే నవంబరు తొలి వారంలో ‘ఓజీ’ కొత్త షెడ్యూల్‌ ఉంటుందని చెప్పారు కూడా. మరి ఆ షూటింగ్‌ అవుతుందా అనేది కూడా అనుమానమే. ఇక ‘హరి హర వీరమల్లు’ సంగతి అయితే సరేసరి. అనుకోవడం తప్ప షూటింగ్‌ అనేది ఆ సినిమాకు సంబంధించి బాగా దూరంగా పోయింది. చూద్దాం పవన్‌ మరి ఏ నిర్ణయం తీసుకుంటాడో.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus