2 రోజుల నుండి టాలీవుడ్ నిర్మాతలపై జరుగుతున్నా ఐటీ రైడ్స్ వల్ల కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా నిర్మాత దిల్ రాజుని (Dil Raju) ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. దిల్ రాజు ఇల్లు, ఆఫీస్.. అతని తమ్ముళ్లు శిరీష్ (Shirish) – లక్ష్మణ్..ల ఇళ్ళు, దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఇల్లు.. అంతేకాకుండా దిల్ రాజు భార్య తేజస్విని బ్యాక్ లాకర్లు ఇలా అన్నీ చెక్ చేశారు. గత 2 ఏళ్ళుగా దిల్ రాజు నిర్మించిన సినిమాలు..
వాటి బడ్జెట్ లెక్కలు, కలెక్షన్ల లెక్కలు.. నటీనటుల పారితోషికాల వివరాలు.. ఇలా అన్నీ చెక్ చేశారట. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు రూ.450 కోట్లు బడ్జెట్ పెట్టినట్టు ప్రమోషన్స్ లో మేకర్స్ చెప్పుకొచ్చారు. ఆ సినిమాకి అంత బడ్జెట్ ఎలా పెట్టారు? పోస్టర్స్ పై వచ్చిన రూ.300 కోట్లకు లెక్కలు.. ఇలా అన్నింటిపై ఆరా తీసారట.
ఈ క్రమంలో దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో (Vijay Thalapathy) చేసిన సినిమా రూ.300 కోట్లు కలెక్ట్ చేసినట్లు పోస్టర్స్ బయటకి వచ్చాయి. అలాగే విజయ్ ఆ సినిమాకు గాను రూ.100 కోట్లు పారితోషికం అందుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. వీటిపై కూడా ఐటీ అధికారులు దిల్ రాజుని ఆరా తీసారట. ఇందుకు దిల్ రాజు..
ఆ ప్రచారంలో నిజం లేదని ‘వరిసు’ (Varisu) సినిమా రూ.120 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని, ఆ సినిమాకు గాను విజయ్ కి రూ.40 కోట్లు పారితోషికం ఇచ్చినట్టు దిల్ రాజు వివరణ ఇచ్చారట. అలాగే తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదని కూడా దిల్ రాజు చెప్పినట్లు తెలుస్తుంది.