The Elephant Whisperers: ఆస్కార్‌ డైరక్టర్‌పై కీలక పాత్రధారుల ఆరోపణలు… ఏమైందంటే?

ఆస్కార్‌ విజేత ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌కు ఆ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన బొమ్మన్‌ – బెల్లీ దంపతుల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఆరోపణలతో ఇప్పటికే వేడెక్కిన ఈ వ్యవహారంలో ఇప్పుడు విషయం లీగల్‌ నోటీసుల వరకు వచ్చింది. సినిమా చిత్రీకరించే సమయంలో కార్తికి ఇచ్చిన మాట గురించే ఇప్పుడు గొడవంతా జరుగుతోంది. అంతేకాదు ఈ కారణంగానే ఇప్పుడు రూ.2 కోట్ల లీగస్‌ నోటీస్‌ను పంపించే వరకు వచ్చింది.

‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ సినిమా (The Elephant Whisperers) షూటింగ్‌ జరుగుతున్న సమయంలో తమకు అన్నివిధాలుగా సాయం చేస్తానంటూ కార్తికి మాటిచ్చిందని బొమ్మన్‌ – బెల్లీ దంపతులు అంటున్నారు. ఆ మాటలను ఇప్పటికీ నెరవేర్చలేదని నోటీసులో పేర్కొన్నారు. అంతేకాదు ఇల్లు, వాహనం, మనవరాలు చదువుకు కావాల్సిన సాయం, వసూళ్లలో కొంత మొత్తాన్ని ఇస్తానని కార్తికి మాకు చెప్పారని బొమ్మన్‌ – బెల్లీ దంపతులు లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఆస్కార్‌ వచ్చిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నుండి కార్తికి పురస్కారాలు అందుకున్నారని బొమ్మన్‌ – బెల్లీ దంపతులు గుర్తు చేశారు.

కానీ తమకు మాత్రం మొండిచేయి చూపించారని అంటున్నారు. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ దంపతుల జీవితం ఆధారంగా ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ అనే లఘుచిత్రం రూపొందించారు. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన ఈ దంపతులే పాత్రధారులు. గునీత్‌ ఈ సినిమా నిర్మించారు. 42 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2023 ఆస్కార్‌ వేడుకల్లో ఉత్తమ లఘు చిత్రంగా పురస్కారం సొంతం చేసుకున్నారు.

ఆస్కార్‌ వచ్చినప్పటి నుండి సన్మాన సభల్లో ఆ అవార్డును పట్టుకోనివ్వలేదని బొమ్మన్‌ – బెల్లీ దంపతులు చెప్పారు. ఆ డాక్యుమెంటరీ తర్వాత ప్రశాంతత కోల్పోయామని కూడా ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆరోపణలపై నిర్మాణ సంస్థ స్పందించింది. వాళ్ల మాటల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకురాలికి లీగల్‌ నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus