Nagarjuna: మైల్‌ స్టోన్‌ మూవీ విషయంలో నాగార్జున మల్లగుల్లాలు… ఎప్పటికి తేలుతుందో?

వందో సినిమా… ఏ హీరోకైనా, హీరో అభిమానికైనా చాలా ప్రతిష్టాత్మకం. ఆ సినిమా దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఎవరు, ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారు, ఎలా వస్తుందో, ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అంటూ పెద్ద ఎత్తున డిస్కషన్స్‌ ఉంటాయి. ఇంతటి స్పెషల్‌ సిట్యువేషన్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో అక్కినేని నాగార్జునకు, ఆయన అభిమానులకు ఉంది. ఆయన వందో సినిమాకు ఇంకా రెండు సినిమాల దూరంలో ఉన్నారు. 99వ సినిమాను ‘నా సామి రంగా’ అంటూ ఇటీవల అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో వందో సినిమా డిస్కషన్స్‌ మొదలయ్యాయి.

నిజానికి నాగార్జున (Nagarjuna) వందో సినిమా డిస్కషన్‌కు అసలు తావులేదు. ఎందుకంటే ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా సమయంలో దర్శకుడు మోహన్‌రాజా కన్‌ఫామ్‌ చేసేశారు. నాగార్జున వందో తానే చేస్తున్నానని, యాక్షన్‌ జోనర్‌లో ఆ సినిమా తెరకెక్కుతుందని, అందులో అఖిల్‌ కూడా నటిస్తాడని చెప్పారు. అయితే ఇప్పుడు సమస్య అల్లా అక్కడే వచ్చింది. వందో సినిమా చేస్తానని చెప్పిన మోహన్‌ రాజా ‘తని ఒరువన్‌ 2’ పనుల్లో పడిపోయారు. అది ఎప్పుడు అవుతుందో తెలియదు. మరోవైపు నాగార్జునకు రెండు, మూడు ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి.

అలా అయితే వాటిలో ఒకటి వందో సినిమాగా చేసేయొచ్చు కదా అనే డౌట్‌ రావొచ్చు. అయితే ఆ రెండు ప్రాజెక్ట్‌ల్లో నాగ్‌ ఫుల్‌ లెంగ్త్‌ హీరో రోల్స్‌ చేయరు. కొన్ని పెద్ద సినిమాల్లో నాగ్‌ను కీలక పాత్ర కోసం అడిగారట. దీంతో అవి చేస్తే వందో నెంబరు వాటిల్లో ఒక సినిమాకు పడిపోతుంది అని డౌట్‌. దీంతో మోహన్‌ రాజా సినిమాకు కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత ఆ స్పెషల్‌ క్యారెక్టర్‌లు చేస్తారు అని ఓ టాక్‌ నడుస్తోంది. ఆ పాత్రలు కూడా భారీగానే ఉండబోతున్నాయి అంటున్నారు.

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. అలాగే ధనుష్‌ – శేఖర్‌ కమ్ముల కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ రెండు సినిమాల్లో నాగ్‌కు స్పెషల్‌ క్యారెక్టర్‌ ఉంది అని టాక్‌. మరి అదే నిజమైతే వందో సినిమాకు ముందు కొబ్బరికాయ కొట్టేయాలి. చూడాలి మరి నాగార్జున ఏం ఆలోచన చేస్తారో?

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus