Trivikram: త్రివిక్రమ్‌ సినిమా ఛాన్స్‌ అందుకే వద్దంటున్నారా!

స్టార్‌ హీరో – స్టార్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్‌ సినిమా. టాలీవుడ్‌లో ఆ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్‌ మొదలవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభానికి హీరోయిన్‌ ఎంపికే అడ్డంకి అని సమాచారం. అదేంటి పూజా హెగ్డేని కథానాయికగా ఎప్పుడో ఎంపిక చేసేశారు కదా అంటారా. అవును అయితే ఈ సినిమాలో ఇంకో కథానాయిక కూడా ఉంది… ఉంటుంది… ఉండాల్సిందే. అంత పక్కాగా ఎలా అనుకుంటున్నారా.

Click Here To Watch

త్రివిక్రమ్‌ రీసెంట్‌ సినిమాలను పరిశీలిస్తే ఇద్దరు కథానాయికలు తప్పనిసరిగా ఉంటారు. సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా, కథలో ఆ పాత్రకు విలువ లేకపోయినా ఇద్దరు నాయికలు కాన్సెప్ట్‌ మాత్రం పక్కాగా వాడుతున్నారు త్రివిక్రమ్‌. ఇప్పుడు మహేష్‌బాబు సినిమాకు కూడా అదే కాన్సెప్ట్‌ అప్లై చేస్తున్నారు. పూజా హెగ్డేకి తోడుగా మరో యువ కథానాయికను ఎంపిక చేయాలని చూస్తున్నారు. అయితే ఈ పాయింట్ అంత ఈజీగా ఓకే అయ్యేలా కనిపించడం లేదు అనేది తాజా కబురు. ఎందుకు ఏంటి అనే విషయమై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

ఆ చర్చ ఎందుకు అనేది మీకు అర్థమవ్వాలంటే త్రివిక్రమ్‌ సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్ల పాత్రలు చూస్తే అర్థమైపోతుంది. ‘జల్సా’ సినిమాలో ఇలియానా మొదటి హీరోయిన్‌ అయితే పార్వతి మెల్టన్‌ రెండో హీరోయిప్‌. ఇక ‘అత్తారింటికి దారేది’లో సమంత ఫస్ట్‌ నాయిక అయితే, ప్రణీత రెండో నాయిక. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలో అదా శర్మను రెండో హీరోయిన్‌గా తీసుకున్నారు. మొదటి నాయిక సమంతనే. ఇక ‘అ ఆ’లో అనుపమ పరమేశ్వరన్‌కి రెండో కథానాయిక పాత్ర దక్కింది. తొలి నాయికగా సమంత నటించింది.

‘అరవింద సమేత వీర రాఘవ’లో ఈషా రెబ్బాను రెండో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ‘అల వైకుంఠపురము’లో సెకండ్‌ కథానాయికగా నివేదా పేతురాజ్‌ను సెలక్ట్‌ చేశారు. ఈ రెండు సినిమాల్లో ఫస్ట్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది. ఇప్పుడు మహేష్‌తో త్రివిక్రమ్‌ తీస్తున్న సినిమాలో కూడా పూజనే ఫస్ట్‌ హీరోయిన్‌. సెకండ్‌ హీరోయిన్‌ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నా ఎవరూ ఫైనల్‌ కావడం లేదు. సంయుక్త మేనన్‌, అను ఇమ్మాన్యుయేల్‌ అంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు శ్రీలీల పేరు కూడా చర్చలోకి వచ్చింది.

ఇన్ని పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి. మహేష్‌ – త్రివిక్రమ్‌ లాంటి స్టార్ల సినిమాలో సెకండన్‌ హీరోయిన్‌ అంటే ఎందుకు ఓకే చెప్పడం లేదు అనేదే ప్రశ్న. అయితే పైన చెప్పుకున్నట్లు సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన వాళ్లంతా ఆ తర్వాత కెరీర్‌తో సరైన విజయాలు, అవకాశాలు దక్కించుకోలేకపోవడం గమనార్హం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus