వరుస విజయాలు వస్తున్నాయి.. తలకెక్కించుకున్నావో ఇక అంతే!

సినిమా ఛాన్స్‌లు రావడం ఎంత కష్టమో, వచ్చాక వరుసగా మంచి సినిమాలు ఎంచుకోవడం ఎంచుకోవడం మరింత కష్టం. అంతేకాదు ఆ తర్వాత అవకాశాల్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ఇదేంటి.. అవకాశాలు నిలబెట్టుకోవడం గురించి మాట్లాడుతున్నాం ఏమైంది అనుకుంటున్నారా? ఏం లేదు సంయుక్త వరుసగా అవకాశాలు సంపాదిస్తోంది, అలాగే విజయాలు కూడా అందుకుంటోంది. దీంతో కాస్త జాగ్రత్త సంయుక్తా అని చెప్పడం మా ఉద్దేశం.టాలీవుడ్‌లో హీరోయిన్లు రావడం, వెళ్లిపోవడం అనేది మనం చూస్తున్నాం.

దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. అవకాశాలు వస్తున్నాయి కదా.. పాత్ర బరువు, కథ బరువు చూసుకోకపోవడం. పాత్ర బరువు విషయంలో కాస్త ఆలోచన తగ్గించినా, కథ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్టార్‌ హీరోలు ఉన్నారు, పెద్ద బ్యానర్లు ఉన్నాయి అని సినిమా ఒప్పేసుకోకూడదు. అలా ఒప్పుకుని వరుస ఫ్లాప్‌లు వచ్చి ఇబ్బంది పడుతున్న నాయికలు చాలామంది ఉన్నారు మరి. దీంతో ‘విరూపాక్ష’ విజయంతో ఎంజాయ్‌ చేస్తున్న సంయుక్తకు కాస్త జాగ్రత్త అనే సూచనలు వినిపిస్తున్నాయి.

సాయిధరమ్‌ తేజ్‌తో ఆమె నటించిన ‘విరూపాక్ష’ సినిమా మంచి విజయం అందుకుంది. అంతేకాదు అందులో ఆమె పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. దీంతో టాలీవుడ్‌లో కొత్త సినిమా అంటే సంయుక్త పేరు వినిపించే పరిస్థితి వచ్చింది. అయితే శ్రీలీల లేదంటే సంయుక్త అనేలా మారిపోయింది అని కూడా అంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ – రానాల ‘భీమ్లా నాయక్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది సంయుక్త. ఆ తర్వాత కల్యాణ్‌ రామ్‌ ‘బింబిసార’ సినిమా చేసింది.

నిజానికి ఆమెను తొలుత సెలక్ట్‌ చేసింది ‘విరూపాక్ష’ టీమే. అయితే సాయి ధరమ్‌ తేజ్‌ అనారోగ్యం కారణంతో సినిమా ఆలస్యమైంది. ఈ లోపు మిగిలిన సినిమాలు వచ్చాయి. ఇటీవల ధనుష్‌తో ‘సార్‌’ సినిమా కూడా చేసింది. త్వరలో ఆమె నుండి ‘డెవిల్’ సినిమా రాబోతోంది. కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. మరికొన్ని కొత్త సినిమాలు ఓకే చేసే పనిలో ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త సంయుక్తా! మంచి సినిమాలు ఓకే చెయ్‌!

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus