స్టార్లూ… సినిమా కష్టాలు కనిపించడం లేదా!

  • December 24, 2021 / 08:20 PM IST

‘గగనం’ సినిమాలో పృథ్వీ క్యారెక్టర్‌ గుర్తుందా? షైనింగ్‌ స్టార్‌ చంద్రకాంత్‌. రీల్‌ హీరో అయిన షైనింగ్‌ స్టార్‌… ఆ తర్వాత రియల్‌ హీరోగా మారుతాడు. ఈ సినిమాను ఇప్పుడు మన టాలీవుడ్‌ హీరోలకు చూపించాలేమో. ఎందుకంటే సినిమా కంటే మాకేదీ ఎక్కువ కాదు అని చెప్పే ఈ స్టార్‌ హీరోలు, హీరోలు, కొత్త హీరోలు… ఇప్పుడు అదే సినిమాకు కష్టం వస్తే… ముఖం చాటేస్తున్నారు కాబట్టి. తలా చేయి వేసి, సినిమా థియేటర్లను, పంపిణీ రంగాన్ని, ప్రదర్శన రంగాన్ని కాపాడాల్సిన వాళ్లు… మూతి మీద వేలేసుకొని గమ్మునున్నారు. వసూళ్లు లేక విలవిల్లాడుతున్న థియేటర్లు చూసైనా, నిర్వహించలేక మూతపడుతున్న హాళ్లు చూసైనా వీరు కిమ్మనడం లేదు.

‘గగనం’ సినిమాలో పృథ్వీ క్యారెక్టర్‌ గుర్తుందా? షైనింగ్‌ స్టార్‌ చంద్రకాంత్‌గా పృథ్వీ ఆ సినిమాలో అదరగొట్టాడు. ఓ రోజు క్యాంప్‌ కోసం కోసమని విమానం ఎక్కుతాడు. అతనితోపాటే అతని వీరాభిమాని కూడా విమానమెక్కుతాడు. హీరోగా పృథ్వీ సినిమాలో చేసే ఫైట్లు, యాక్షన్‌, డైలాగ్‌లు, కౌంటర్లు… బయట కూడా చేస్తాడేమో అని ఆ ఫ్యాన్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తాడు. అందుకే తెగ ఆరాటపడిపోతుంటాడు. అలాంటి సమయంలో ఆ విమానం హైజాక్‌ అవుతుంది. కాపాడమని ఆ అభిమాని షైనింగ్‌ స్టార్‌ను అడుగుతాడు. అతనేమే అదంతా సినిమా నా వల్ల కాదు అంటాడు. ఆ తర్వాత ఆ అభిమాని చీదరించుకుంటాడు. ఆఖరికి హైజాకర్లను షైనింగ్‌ స్టార్‌ అడ్డుకుంటాడు. అలా… రీల్‌ హీరో, రియల్‌ హీరోగా మారుతాడు.

ఆ సినిమాలో దేశంలో షైనింగ్‌ స్టార్‌ అంత కష్టపడ్డాడు. ప్రాణాలకు తెగించాడు. ఇప్పుడు సినిమా కోసం మన స్టార్లు ఆ మాత్రం ముందుకు రాలేరా? ఆ సినిమాలో లాగా ప్రాణాలు విడవక్కర్లేదు. కాస్త నోరు విప్పితే చాలు. టాలీవుడ్‌ కష్టాలపై మూడు నెలల క్రితం పవన్‌ మాట్లాడితే… వదిలేశారు. ఇప్పుడు నాని అదే విషయం గురించి మాట్లాడితే ఒక్క నిర్మాత, ఒక్క హీరోనే మాట్లాడారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇండస్ట్రీలో ఎంత యూనిటీ ఉందో.

అదేదో పవన్‌ కల్యాణ్‌ ఒక్కరి కష్టం లాగా, నాని ఒక్కడి బాధలాగా వదిలేశారు. మూవీ ఆర్టిస్ట అసోషియేషన్‌ పెద్దగా మంచు విష్ణు నుండి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందన లేదు. మొత్తం అసోసియేషన్‌ మేమే కాపాడుకుంటాం అంటూ హామీలు ఇచ్చిన మంచు విష్ణు అండ్‌ కో. ఇప్పుడు ఏపీలో టికెట్ల విషయమై ఎలాంటి స్పందన లేదో. ‘మా’ అధ్యక్షుడే మాట్లాడటం లేదు… మేమెందుకు అనుకున్నారేమో… మిగిలిన నటులు అంతా కామ్‌గా ఉన్నారు.

చాలా రోజుల క్రితం చిరంజీవి ఈ టాపిక్‌ను ముందు రైజ్‌ చేశారు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌, ఇప్పుడు నాని మాత్రమే టికెట్ల గురించి మాట్లాడారు. టికెట్‌ ధర తగ్గితే… వాళ్లకు ఇచ్చే రెమ్యూనరేషన్‌లోనూ కోత విధిస్తామని గట్టిగా నిర్మాతలు అంటూ ముందుకొస్తారేమో. సినిమా టికెట్ల విషయంలో స్పందించని వారి పేర్లు రాయడం కంటే, మొత్తం హీరోలు… ఈ ముగ్గురు కాకుండా అనుకోవాలేమో. మెగా కుటుంబం నుండి కొత్తగా స్పందించక్కర్లేదని రామ్‌చరణ్‌ అనుకున్నాడు అనుకుందాం. మిగిలిన వాళ్లకు ఏమైందో.

మా బ్లడ్‌ వేరు, మా బ్రీడ్‌ వేరు అనే కథానాయకులు… ఈ విషయంలో నష్టం భరించి ఊరుకున్నారని కాని కిక్కురుమనలేదు. పాన్‌ ఇండియా సినిమా అంటూ నగరాల పట్టుకు తిరుగుతున్న కుర్ర హీరోలు, పాన్‌ ఇండియా స్టార్‌ కూడా ప్రచారం చూసుకుంటున్నారు తప్ప సినిమా థియేటర్ల కష్టాన్ని చూడటం లేదు. కుర్ర హీరోల పరిస్థితి చెప్పాలి అంటే… నోరెత్తిన పాపానికి నాని పడుతున్న కష్టాలు చూసి వాళ్లు ఊరుకుంటున్నారు.

ఎవరికో కష్టం వస్తే స్పందిచాలా అనుకోవడం తప్పు కాకపోవచ్చు. కానీ తమకు ఇన్నాళ్లు తిండి పెడుతున్న సినిమా పరిశ్రమే ఇబ్బందుల్లో ఉంది అంటే కనీసం రియాక్ట్‌ అవ్వాలి అనుకోకపోవడాన్ని ఏమనాలి. అభిమానులు ఎంత సేపు ఫ్యాన్‌ వార్‌ పేరుతో బూతులు తిట్టుకోవడం, ఒకరినొకరు ట్రోల్‌ చేసుకోవడం తప్ప… సినిమా కష్టాల గురించి హీరోలు ఎందుకు మాట్లాడటం లేదు అని చర్చ పెడుతున్నారా? ఇక్కడ ఆలోచించుకోవాల్సింది సినిమా బతకాలి అంటే ఏం చేయాలి అని. అంతేకానీ మన బతకాలి అంటే ఏం చేయాలి అని కాదు.

ఎందుకంటే సినిమా బతకకపోతే… మనం బతికి ఏం సాధిస్తాం హీరోలారా? ‘సినిమా లేని నా జీవితం అస్సలు ఊహించలేను’’ అని అంటుంటారు. మరి అలాంటప్పుడు సినిమాకు కష్టం వస్తే, అలా కూల్‌గా ఉంటే ఎలా? కమాన్‌ ఓపెన్‌ అవ్వండి, మీ కష్టం జనాలకు అర్థమయ్యేలా చెప్పండి? వాళ్ల దగ్గరకి వెళ్లండి. సినిమా ప్రచారం కోసం ఊరూరా వెళ్తారే అలా. అప్పుడే షైనింగ్‌ స్టార్‌ చంద్రకాంత్‌ లాగా మీరూ స్టార్ అవుతారు. లేదంటే జీరోనే. మేమన్నా హర్ట్‌ చేసి ఉంటే సారీ… సినిమా బాగు కోసం మీరు మాట్లాడటం లేదనేదే మా బాధ. ఎంతన్నా సినిమా పిచ్చోళ్లం కదా.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus