సమాజంలో స్త్రీకి రక్షణ లేదు అంటూ మహిళా సంఘాలు గోల చేస్తుంటాయి. అందుకు తగ్గట్లే ఆడవాళ్లపై జరిగే దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే.. అదే సమయంలో మగవారిపై కూడా దాడులు జరుగుతున్నాయి. కాకపోతే మీడియాలో వాటిపై పెద్దగా న్యూస్ రాకపోవడంతో అవి జనాల దృష్టికి వెళ్ళడం లేదు. అంతెందుకు నిన్న జరిగిన జైరా వసీం కేసునే తీసుకోండి. ఆమె వెనుక కూర్చున్న వ్యక్తి కాలు ఆమెకు తగిలినందుకే అమ్మడు తనను లైంగికంగా వేధించాడంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక లైవ్ ఇచ్చేసరికి.. వెంటనే విస్తారా ఫైట్స్ వారు ఒక క్షమాపణ లేఖ ఇవ్వడంతోపాటు.. సదరు వ్యక్తిపై POSCO సెక్షన్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. నిజానికి జరిగింది ఏమిటంటే.. పాపం కుటుంబ సభ్యుల దహనసంస్కారాలు చూసుకొని ఫ్లైట్ లో తిరిగి ముంబై వస్తున్న సదరు ప్రయాణీకుడు నిద్రలో పొరపాటున కాలు ముందుకు పెట్టాడు అంతే. ఆ మాత్రం దానికే అమ్మడు కంప్లయింట్ ఇచ్చిందని అతడ్ని నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేశారు. పాపం అతడి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో బోరుమంటున్నారు.
ఇక నేడు జరిగిన కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసును పరిశీలిస్తే. విజయ్ సాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాక.. వివాహం అనంతరం కూడా వివాహేతర సంబంధాలు కొనసాగించిన వనితారెడ్డి.. ఆ విషయాలు బయటకిపొక్కడంతో విడాకులు తీసుకొని భరణం ఇవ్వాలంటూ విజయ్ ను మానసికంగా హింసించడంతోపాటు.. కూతుర్ని దూరం చేసి బెదిరించడం కూడా మొదలెట్టారు. ఆ బాధలు భరించలేని విజయ్ సాయి ఆత్మహత్య చేసుకొని మరణిస్తే.. వనితారెడ్డి చాలా సింపుల్ గా విజయ్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉండేది, అందువల్లే విడాకులు ఇచ్చాను, నేనెప్పుడు డబ్బు కోసం అతడ్ని వేధించలేదు అంటూ మీడియా సాక్షిగా కెమెరా ముందు కన్నీరు కార్చ్చేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇదేం న్యాయం.. ఒకమ్మాయికి కేవలం కాలు తగిలిందని గోల చేస్తేనే రెచ్చిపోయిన ప్రభుత్వ యంత్రాంగం.. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నా కూడా ఎందుకని వివక్ష చూపుతోంది. ఆడవారిపై జాలి చూపండి తప్పు లేదు కానీ వారి చేసే హేయమైన తప్పుల్ని కూడా కప్పిపుచ్చాలనుకోవడం ఆడది కదా అని వదిలేయడం సమంజసం కాదు.