ప్రభాస్ సాహో అంచనాలు అనుకున్నంత మేర అందుకోని నేపథ్యంలో ఆయన నటిస్తున్న జాన్ మూవీపై భారీ అంచనున్నాయి. జిల్ ఫేమ్ రాధా కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం యూరప్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నేపథ్యంలో, ఈ చిత్రాన్ని కూడా పలు భాషలతో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ఓవర్సీస్ బిజినెస్ కూడా భారీగా జరిగిందట. అన్నీ భాషలలో కలిపి దాదాపు 25 కోట్లకు పైగా ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుందట. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో మూవీకి కూడా ఇంత ఓవర్సీస్ డిమాండ్ ఏర్పడలేదు.
ఇక ఈ మూవీ విడుదల కూడా ఈ ఏడాది ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. సాహో విడుదలకు ముందే 20 శాతం వరకు ఈ చిత్ర షూటింగ్ జరిగింది. ఐతే ప్రభాస్ అనేక కారణాల చేత ఈ చిత్ర షూటింగ్ లో అనుకున్న ప్రకారం పాల్గొనలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ 2020 విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. ఏకంగా ఈ చిత్రం 2021కి పోస్ట్ ఫోన్ అయినట్లు తెలుస్తుంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా జాన్, ఈ ఏడాది విదులయ్యే అవకాశం లేదన్నట్లు హింట్ ఇస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి మరలా నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు. చూద్దాం మరి ప్రభాస్ ఏడాది వస్తాడో లేక మరో ఏడాది సమయం తీసుకుంటాడో..?