శర్వానంద్, సమంత.. ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జాను’. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన ’96’ చిత్రానికి ఇది రీమేక్ . సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ఒరిజినల్ ను తెరకెక్కించిన సి.ప్రేమ్ కుమారే డైరెక్ట్ చేసాడు. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ అనే టాక్ తో పాటు… సమంత, శర్వానంద్ ల నటన సినిమాకే హైలెట్ అనే ప్రశంసలు కూడా కురిసాయి. దీంతో మొదటి వీకెండ్ ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది.
ఇక 3 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 2.20 cr |
సీడెడ్ | 0.67 cr |
ఉత్తరాంధ్ర | 0.85 cr |
ఈస్ట్ | 0.36 cr |
వెస్ట్ | 0.27 cr |
కృష్ణా | 0.40 cr |
గుంటూరు | 0.49 cr |
నెల్లూరు | 0.17 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.37 cr |
ఓవర్సీస్ | 0.82 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 6.60 cr (share) |
‘జాను’ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ జరిగింది. మూడు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 6.60 కోట్ల షేర్ ను రాబట్టింది. మూడో రోజు కూడా ఈ చిత్రం బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో వర్షాల ఎఫెక్ట్ ఈ చిత్రం కలెక్షన్ల పై కొంతవరకూ ఎఫెక్ట్ చూపించిందని చెప్పొచ్చు. లేదంటే మరింతగా కల్లెక్ట్ చేసేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 14.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి అసలు పరీక్ష ఈరోజు నుండీ మొదలుకానుంది. వీక్ డేస్ లో పెర్ఫార్మన్స్ బాగుంటేనే బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ ఉంటుంది.
Click Here For Jaanu Movie Review
Most Recommended Video
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!