టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) ‘జాట్’ (Jaat) అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar) , ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad)..లు ఈ సంయుక్తంగా నిర్మించారు. తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడు. రెజీనా (Regina Cassandra), రమ్య కృష్ణ (Ramya Krishnan), జగపతి బాబు (Jagapathi Babu) , బబ్లూ పృథ్వీరాజ్, అజయ్ ఘోష్ (Ajay Ghosh) , ఆయేషా ఖాన్, బాంధవి శ్రీధర్, ప్రణీత పట్నాయక్, మురళీ శర్మ (Murali Sharma), ‘టెంపర్’ వంశీ (Temper Vamsi) వంటి తెలుగు సినిమా తారలు చాలా మంది ఈ సినిమాలో నటించడం విశేషంగా చెప్పుకోవాలి.
హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి నార్త్ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ప్రభాస్ (Prabhas) వంటి స్టార్స్ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఇక ఆల్రెడీ ఈ సినిమాని కొంతమంది బాలీవుడ్ సినీ ప్రముఖులకు చూపించారు. సినిమా అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం సినిమా రన్ టైం 2 గంటల 33 నిమిషాలు ఉంటుందట.
కథ విషయానికి వస్తే.. ఆధునికంగా వెనుకబడిన ఒక గ్రామం. అక్కడ కోర్టు, పోలీస్ వంటి వాటిని లెక్కచేయని ఒక విలన్ వరదరాజ రణతుంగ(రణదీప్ హుడా) (Randeep Hooda). ప్రజలని చిత్ర హింసకు గురిచేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ గ్రామానికి వచ్చిన భాస్కర్ సింగ్(సన్నీ డియోల్) (Sunny Deol) వరదరాజ మనుషులతో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది. తర్వాత అతనికి ఆ ఊరి ప్రజలు చేసిన సహాయం ఏంటి. వాళ్లకి అతను ఎలా అండగా నిలబడ్డాడు…
అనేది మిగిలిన కథ అని చెబుతున్నారు. ‘జాట్’ లో యాక్షన్ సీక్వెన్స్ ను దర్శకుడు బాగా తెరకెక్కించాడట. హీరో సన్నీ డియోల్ ని ప్రజెంట్ చేసిన తీరు కూడా బాగుందని అంటున్నారు. మాస్ ప్రేక్షకులకి మంచి ఫీస్ట్ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందట. తమన్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పిస్తుందని అంటున్నారు.