Jaat Teaser: నార్త్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన మలినేని!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ‘జాట్’ (Jaat) అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar) , టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad)..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2025 సమ్మర్ కానుకగా ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కొద్దిసేపటి క్రితం టీజర్ ని వదిలారు. ఈ టీజర్ విషయానికి వస్తే… ఇది 1:27 నిమిషాల నిడివి కలిగి ఉంది.

Jaat Teaser

సూర్యలంక పోలీస్ స్టేషన్ కి ‘అతను వచ్చాడు.. అతను వచ్చాడు’ అంటూ ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. ‘ఎవరు అతను? ఎక్కడి నుండి వచ్చాడు? మీ వెనుక ఎందుకు పడుతున్నాడు?’ అంటూ పోలీస్ అయినటువంటి’ జగపతి బాబు (Jagapathi Babu) వాయిస్ ఓవర్లో డైలాగ్స్ వినిపించాయి. ఆ తర్వాత వెంటనే హీరో సన్నీ డియోల్ ఎంట్రీ ఇచ్చాడు. ‘అతను సాయంత్రం నీడలా వస్తాడు? వెలుతురు రాకముందే మాయమవుతాడు?

ఆ 12 గంటల్లో నిమిషాల కంటే అతను విరగొట్టిన ఎముకలు ఎక్కువగా ఉంటాయి’ అంటూ వచ్చే డైలాగులు హై ఇచ్చే విధంగా ఉన్నాయి. ”జాట్’ అంటే రీ- సౌండ్’ అన్నట్టు హీరో పలుకుతున్నాడు. ఈ మొత్తం టీజర్లో తమన్ (S.S.Thaman)  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా హైలెట్ అయ్యింది.కాకపోతే అది ‘మాస్టర్’ ను గుర్తుచేసే విధంగా కూడా ఉంది. నార్త్ ఆడియన్స్ కి కావాల్సిన మాస్ టచ్ ఇచ్చింది ఈ టీజర్. మీరు కూడా ఓ లుక్కేయండి :

 ‘పుష్ప 2’ ..కొద్దిలో ‘ఆర్.ఆర్.ఆర్’ రికార్డు మిస్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus