బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతున్నప్పటికీ జబర్దస్త్ కార్యక్రమాన్ని మాత్రం ఇప్పటివరకు ఏ కార్యక్రమం బీట్ చేయలేదని చెప్పాలి. దాదాపు 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ప్రసారమవుతూ ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి.ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఢీ డాన్స్ షో ద్వారా పరిచయమైనటువంటి ఐశ్వర్య ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈమె రాకెట్ రాఘవ, హైపర్ ఆది స్కిట్లలో సందడి చేస్తున్నారు. అలాగే ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ లో కూడా ఐశ్వర్య సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఐశ్వర్య తన కాబోయే భర్తను పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ వేదికపైనే తన లైఫ్ పార్టనర్ ను పరిచయం చేయబోతున్నాను అంటూ తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. అతని పేరు శ్రీనివాస్ సాయి.
ఈయన కూడా ఇదివరకు కొన్ని (Jabardasth) జబర్దస్త్ స్కిట్లలో కనిపించే సందడి చేసినట్టు తెలుస్తుంది.ఇలా తనకు కాబోయే భర్తను పరిచయం చేయడమే కాకుండా జబర్దస్త్ వేదికపై తనతో తాళి కట్టించుకోవడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ జంటను ఆశీర్వదించారు. ఇలా ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది ఇది చూసి ఐశ్వర్య శ్రీనివాస్ జంట చాలా చూడముచ్చటగా ఉన్నారు
అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఎప్పటిలాగే మల్లెమాలవారు ఈసారి కూడా టిఆర్పి రేటింగ్స్ కోసం వారి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు .మరి వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా లేదా రేటింగ్ కోసమే ఇలా చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!