Shabeena: ‘జబర్దస్త్‌’ షబీనా ఎంగేజ్‌మెంట్‌ పిక్స్‌ వైరల్‌!

మరో ‘జబర్దస్త్‌’ నటి పెళ్లి కూతురు అవుతోంది. ఆ కామెడీ షోలో కార్తిక్‌ టీమ్‌లో స్కిట్స్‌ చేస్తూ ఆకట్టుకుంటున్న షబీనా ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయితే ఆ ఎంగేజ్‌మెంట్‌ ఇప్పుడు కాదు ఓ నెల క్రితం జరిగింది. ఆమె ఇన్‌స్టా పోస్ట్‌ ప్రకారం అయితే జులై 17న ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ అందరికీ పరిచయమైన షబీనా.. జబర్దస్త్‌తో ఇంకాస్త షైన్‌ అయ్యింది అని చెప్పాలి.

‘‘జూలై 17ని ఎప్పటికీ మరిచిపోలేను’’ అంటూ తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది షబీనా. ఆమెకు కాబోయే భర్త పేరు మున్నా ఆ ఫొటోలో ఎంగేజ్‌మెంట్‌ రింగ్ పట్టుకుని కనిపించాడు. అతని ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ ప్రకారం చూస్తే.. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు అనిపిస్తోంది. మార్చి నెలలో ఇద్దరూ కలసి బీచ్‌ దగ్గర తీసిన ఫొటోలను షేర్‌ చేసి ఉన్నారు. ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు అన్నమాట.

ఇక షబీనా గురించి చూస్తే.. ముందుగా చెప్పినట్లు తొలుత సీరియల్స్‌లో కనిపించింది. ‘కస్తూరి’ సీరియల్‌లో ముఖ్య పాత్ర చేసింది. ఆ తర్వాత ‘గృహలక్ష్మీ’ సీరియల్‌లోనూ కనిపించింది. సీరియల్స్‌లో కాస్త గ్లామర్‌ పాత్రలే చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నెలల క్రితం జబర్దస్త్‌లోకి వచ్చింది. పెద్ద పెద్ద పాత్రలు లేకపోయినా.. కనిపించినంతసేపు ఆకట్టుకుంటూ ఉంటుంది. జబర్దస్త్‌ స్టైల్‌లో కార్తిక్‌, నరేశ్‌లతో షో రిలేషన్‌ ట్రాక్‌లు పెట్టారు.

మరి పెళ్లి ఎప్పుడు? పెళ్లి అయ్యాక టీవీల్లో షబీనా కనిపిస్తుందా? అనేది చూడాలి. ఇటీవల కాలంలో సీరియల్స్‌లో పెద్దగా కనిపించడం లేదు. అయితే టీవీ షోస్‌లో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తోంది. పెళ్లి అయ్యాక కూడా సీరియల్స్‌ కొనసాగిస్తుంటారు మన టీవీ నటులు. ఆ లెక్కన షబీనా కూడా నటించే అవకాశం ఉంది. ఆమె ఎంగేజ్‌మెంట్స్‌ పిక్స్‌ పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అవే ఇవీ.

1

2

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus