‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రాంప్రసాద్ (Auto Ram Prasad) అందరికీ సుపరిచితమే. గెటప్ శీను, సుడిగాలి సుధీర్..ల స్కిట్స్ లో ఆటో పంచ్..లు వేస్తూ ఇతను పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత టీం లీడ్ కూడా అయ్యింది. ‘ఖైదీ నెంబర్ 150’ వంటి పలు సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు కూడా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా.. రైటర్ కూడా పలు చిన్న సినిమాలకు పనిచేస్తున్నాడు రాంప్రసాద్.
Auto Ram Prasad
అయితే తాజాగా ఇతని కారు రోడ్డు ప్రమాదానికి గురవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఓ యాక్సిడెంట్ జరిగింది. అది జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్‌కు కారుకి అని సమాచారం. తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రయాణిస్తున్న టైంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న రాంప్రసాద్ (Auto Ram Prasad)…సడన్ గా బ్రేక్ వేశాడట.
దీంతో వెనుక నుండి వస్తున్న కారు, రాంప్రసాద్ కారుని ఢీ కొట్టిందట. స్థానికులు వెంటనే 108 కి కాల్ చేయడంతో అంబులెన్స్ రావడం.. రాంప్రసాద్ ని హాస్పిటల్ కి తరలించడం జరిగిందట. దీంతో అతనికి స్వల్ప గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. మరోపక్క రాంప్రసాద్ కారు వెనుక భాగం కూడా డ్యామేజ్ అయినట్టు స్పష్టమవుతుంది. ఈ ఘటనపై పోలీస్ కేసు కూడా నమోదైనట్టు వినికిడి.