Jabardasth Emmanuel: తాత చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయా.. ఇమ్మాన్యుయేల్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్లలో కొందరు సినిమాలలో హీరోలుగా నటిస్తూ క్రేజ్ పెంచుకుంటున్నారు. మరి కొందరు నటులు వరుస సినిమాలలో కమెడియన్లుగా నటిస్తూ భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. అయితే జబర్దస్త్ కమెడియన్లు రీల్ లైఫ్ లో నవ్వించినా చాలామంది కమెడియన్ల జీవితాలలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి.

తాము ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందని ఇప్పటికే చాలామంది కమెడియన్లు తమ అనుభవాలను వేర్వేరు సందర్భాల్లో పంచుకోవడం జరిగింది. అయితే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ లైఫ్ లో చోటు చేసుకున్న విషాదకర సంఘటన గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాత చనిపోతే కళ్లు తుడుచుకుని జబర్దస్త్ స్కిట్ చేశానని తాత చివరిచూపుకు కూడా నోచుకోలేకపోయానని ఇమ్మాన్యుయేల్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ షోకు వచ్చిన కొత్తలో షూట్ సమయంలో నాన్న నుంచి కాల్ వచ్చిందని నేను ఎంతో ఇష్టపడే వ్యక్తులలో ఒకరైన తాతయ్య మరణించారని నాన్న చెప్పడంతో ఎంతో బాధ పడ్డానని ఇమ్మాన్యుయేల్ వెల్లడించారు. ఆ సమయంలో నేను స్కిట్ చేయాల్సి ఉందని అందువల్ల వెంటనే వెళ్లలేని పరిస్థితి అని ఇమ్మాన్యుయేల్ తెలిపారు. బాధ పడుతూనే కన్నీళ్లు తుడుచుకుని స్కిట్ చేశానని స్కిట్ అద్భుతంగా వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

స్కిట్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే సమయానికి తాత అంత్యక్రియలు పూర్తయ్యాయని ఇమ్మాన్యుయేల్ పేర్కొన్నారు. ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అవుతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇమ్మాన్యుయేల్ ఇప్పటికే పలు సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇమ్మాన్యుయేల్ వర్ష కలిసి చేసిన స్కిట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇమ్మాన్యుయేల్ పలు వెబ్ సిరీస్ లలో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus