ఘనంగా పెళ్లి చేసుకున్న కమెడియన్ కెవ్వు కార్తీక్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ కెవ్వు కార్తీక్ ఒకరు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కార్తీక్ జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూనే మరోవైపు వెండితెర అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన బెల్లంకొండ గణేష్ నటించిన స్టూడెంట్ సర్ అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ విధంగా వెండితెర పైన బుల్లితెర పైన ఎంతో బిజీగా ఉన్నటువంటి కెవ్వు కార్తిక్ పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తనకు కాబోయే భార్య ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన భార్య పేస్ ఎక్కడ రివీల్ చేయని కార్తీక్ మరికొద్ది రోజులకు తన భార్య ఫేస్ రివిల్ చేయడమే కాకుండా తనతో కలిసి తగ్గిన ఫోటోలను షేర్ చేస్తూ తను నా జీవితంలోకి వస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లవ్ యు సిరి అంటూ తనకు కాబోయే భార్య పేరు సిరి అని చెప్పుకొచ్చారు.

ఇలా తాను (Kevvu Karthik) పెళ్లి చేసుకోబోతున్నానని విషయాన్ని ప్రకటించిన కార్తీక్ గురువారం హైదరాబాదులో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.ఈ విధంగా కార్తీక్ సిరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు జబర్దస్త్ కమెడియన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.అయితే వీరి వివాహ వేడుకకు కార్తీక్ ఆప్తమిత్రుడు అయినటువంటి గెటప్ శ్రీను తన భార్యతో కలిసి హాజరయ్యారు.

ఈ క్రమంలోనే గెటప్ శ్రీను సోషల్ మీడియా వేదికగా కార్తీక్ పెళ్లిలో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. కార్తీక్ శ్రీలేఖల వివాహం గురువారం జరిగిందని తెలిపారు.జీవితాంతం వీరిద్దరు చాలా సంతోషంగా ఉండాలని ఈయన ఆకాంక్షిస్తూ షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. అయితే ఇక్కడ గెటప్ శ్రీను కార్తీక్ భార్య పేరును శ్రీలేఖ అంటూ చెప్పుకొచ్చారు. అయితే కార్తీక్ మాత్రం సిరి అని పరిచయం చేశారు బహుశా అది తన ముద్దు పేరు కూడా కావచ్చని తెలుస్తుంది.ఈ విధంగా కమెడియన్ కెవ్వు కార్తీక్ వివాహం జరిగిందని తెలియడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా కార్తీక్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus