Jabardasth Faima: అదే నా ధ్యేయం అంటున్న జబర్దస్త్ ఫైమా?

బుల్లితెర షోలలో ఒకటైన జబర్దస్త్ షోపై ఎన్నో విమర్శలు వ్యక్తమవుతున్నా ఈ షోకు మంచి రేటింగ్ వస్తుండటంతో ఈ షో నిర్వాహకులు ఈ షోను కొనసాగిస్తున్నారు. ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న ఎంతోమంది కమెడియన్లకు ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కింది. జబర్దస్త్ షో ద్వారా సక్సెస్ అయ్యి ఇతర టీవీ షోలతో, సినిమాలతో బిజీ అవుతున్న కమెడియన్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. జబర్దస్త్ కమెడియన్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జరిగే ఈవెంట్లలో పాల్గొని ఆర్థికంగా స్థిరపడుతున్నారు.

జబర్దస్త్ ద్వారా ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన కంటెస్టెంట్లలో ఫైమా ఒకరు. ఓవర్ యాక్షన్ చేస్తుందని కొంతమంది నెటిజన్లు ఫైమాపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా ఎక్కువమంది నెటిజన్లు మాత్రం ఆమెను ప్రశంసిస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన జబర్దస్త్ ఫైమా షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉందని ఆమె చెప్పకనే చెప్పేశారు. బీడీలు చుట్టి తల్లి తనను పెంచిందని తాము నలుగురు అక్కాచెల్లెళ్లమని నలుగురిలో ముగ్గురికి ఇప్పటికే పెళ్లిళ్లు అయ్యాయని అమ్మ తను సంపాదించిన కొంత డబ్బుతో మమ్మల్ని పెంచిందని ఫైమా అన్నారు.

తన పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తల్లి కోరుకునేదని ఆమె కామెంట్లు చేశారు. జబర్దస్త్ షో ద్వారా మంచి పేరును సంపాదించుకుని తల్లి కోరికను నెరవేర్చానని ఆమె చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి తాము అద్దె ఇంట్లో జీవనం సాగించామని అద్దె ఇంట్లో ఉండటం వల్ల తాము అనుభవించిన కష్టాలు అన్నీఇన్నీ కావని ఫైమా పేర్కొన్నారు.

అమ్మకు మంచి ఇల్లు కట్టించి ఇవ్వడమే తన లక్ష్యం, ధ్యేయం అని ఆమె చెప్పుకొచ్చారు. తల్లి కోసం ఇల్లు కట్టిస్తానని ఫైమా చెప్పిన మాటలకు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఫైమా కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus