Jabardasth Faima: హాట్ టాపిక్ గా మారిన ఫైమా బర్త్ డే ఫోటోలు… ఎందుకంటే..!

ఫైమా షేక్ (Faima) అలియాస్ ‘జబర్దస్త్’ ఫైమా అందరికీ సుపరిచితమే.’పటాస్’ షోలో ఓ స్టూడెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్ రవి సహకారంతో అందులో యాంకర్ ఛాన్స్ దక్కించుకుంది ఫైమా. తన వన్ లైనర్స్ తో ఆమె చాలా మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. అటు తర్వాత ‘పోవే పోరా’ ‘జబర్దస్త్’ వంటి షోలతో ఈమె రేంజ్ పెరిగింది. ఇక అదే టైంలో ఈమెకు బిగ్ బాస్ ఛాన్స్ రావడం..

ఆ తర్వాత ఆమె ఇమేజ్ మరింతగా పెరగడం వంటివి కూడా జరిగాయి. ఆ షోలో తన గేమ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరైంది ఫైమా అని చెప్పుకోవాలి.దాని వల్ల ఈమెకు సినిమాల్లో ఛాన్సులు కూడా లభించాయి. ఇదిలా ఉండగా.. నిన్న అంటే మే 19న ఫైమా తన 26 వ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది. కాకపోతే ఈసారి ఆమె బర్త్ డే కొంచెం స్పెషల్.

ఎందుకంటే ఈసారి తన బాయ్ ఫ్రెండ్ తో బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుందట ఫైమా. ఆమె లేటెస్ట్ ఫోటోలు గమనిస్తే.. ఒకతను ఆమెకు రింగ్ తొడుగుతూ, తర్వాత కేక్ తినిపిస్తున్నట్టు ఉంది. అలాగే ‘ హ్యాపీ బర్త్ డే మై లవ్.. ఈ 5 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తెలీదు. జీవితాంతం ఇలాగే కలిసుందాం’ అంటూ బర్త్ డే విషెస్ ని చెబుతూ ఆ వ్యక్తి ఫైమాని ట్యాగ్ చేశాడు.

అతని పేరు ప్రవీణ్ నాయక్ అని ఉంది. అయితే ఫైమా ‘జబర్దస్త్’ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు వేరే ప్రవీణ్ ఫోటోలో కనిపిస్తున్నాడు. ‘అంటే షో కోసం జనాలని చీట్ చేశావా?’ అంటూ ప్రేక్షకులు ఫైమాపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus