Kiraak RP Marriage:సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘జబర్దస్త్’ కమెడియన్ కిరాక్ ఆర్పీ.. వీడియో వైరల్

‘జబర్దస్త్’ కమెడియన్ కిరాక్ ఆర్పీ అందరికీ సుపరిచితమే. ఈ షోలో పలు స్కిట్స్ లో తనదైన కామెడీని పండించి పాపులర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ. ఆ తర్వాత ‘అదిరింది’ ‘కామెడీ స్టార్స్’ వంటి కామెడీ షోలలో కూడా పాల్గొన్నాడు. ఇక నెల్లూరు వారి చేపల పులుసు కర్రీ పాయింట్ ని స్టార్ట్ చేసి.. మరింతగా వార్తల్లో నిలిచాడు అని చెప్పాలి. అసలు విషయంలోకి వెళితే.. కిరాక్‌ ఆర్పీ తాజాగా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు.

తాను ప్రేమించిన లక్ష్మీ ప్రసన్నతోనే (Kiraak RP ) కిరాక్ ఆర్పీ పెళ్లి జరిగింది. ఈరోజు అనగా బుధవారం నాడు వైజాగ్‌లో వీరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పలువురు సినీ సెలెబ్రిటీలు వీరి పెళ్ళికి విచ్చేసి తమ బ్లెస్సింగ్స్ ను అందించారు. బీచ్ కి అతి దగ్గరగా ఉన్న పెళ్లి మండపంలో వీరు పెళ్లి చేసుకున్నట్టు కిరాక్ ఆర్పీ తెలిపాడు. ఏడాది క్రితమే వీరికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు చెప్పాడు.

ఆ వేడుకకు ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు అలాగే ఇంకా కొంతమంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. సివిల్స్ కోచింగ్ కోసం ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌ లో జాయిన్ అయిన లక్ష్మీ ప్రసన్నని ఆర్పీ చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడట. ఓ సారి ఆ ఇన్‌స్టిట్యూట్‌కు గెస్ట్‌గా వెళ్లిన ఆర్పీకి అలా జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి వీరు ప్రేమని వ్యక్త పరుచుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus