ఘనంగా ‘జబర్దస్త్’ కమెడియన్ మోహన్ పెళ్లి!

‘బజర్థస్త్‌’ కామెడీ షో వల్ల చాలా మంది జీవితాలు మారిపోయాయి. జనాలకు ఎంటర్టైన్మెంట్ ను పంచడమే కాకుండా.. స్ట్రెస్ బస్టర్ కూడా కొన్నాళ్ళు పనిచేసింది ఈ షో. పక్క ఛానల్స్ లో ఎన్ని కామెడీ షోలు వచ్చినా.. ‘జబర్దస్త్’ ని అవి మ్యాచ్ చేయలేకపోయాయి. టి.ఆర్.పి రేటింగ్లలో కూడా సంచలనాలు సృష్టించింది ఈ షో. 2013 నుండి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ షో హవా ఇప్పుడు కొంచెం తగ్గినా..

మొత్తంగా అయితే ఇప్పటికీ ఈ షోని కొంతమంది చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మరోపక్క ‘జబర్దస్త్’ ఎంతో మంది జీవితాలు మార్చేసింది. సినిమాల్లో అవకాశాలు రాబట్టుకుంటూ కొంతమంది బిజీగా ఉంటే, ఇంకొంతమంది హీరోలు కూడా అయిపోయారు. ఇదిలా ఉండగా.. ఈ షోలో లేడీ గెటప్..లు వేస్తూ ఫేమస్ అయిన వారిలో మోహన్ ఒకడు .రాకెట్ రాఘవ (Rocket Raghava) టీంలో మోహన్.. కోకిల పేరుతో కామెడీ పండిస్తాడు అనే సంగతి తెలిసిందే. బొంగురు గొంతులో ఇతను చెప్పే డైలాగులు కూడా బాగా ఫేమస్.

ఇదిలా ఉండగా.. మోహన్ తాజాగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఇతని పెళ్లి ఘనంగా జరిగింది. కొంతమంది ‘జబర్దస్త్’ సెలబ్రిటీలు వీరి పెళ్ళిలో సందడి చేశారు. ఈ మధ్య వరుసగా సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) , మీరా చోప్రా (Meera Chopra) వంటి స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మోహన్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus