Jabardasth Naresh: జబర్దస్త్ నరేష్ లవర్ ఈమేనట.. అసలేం జరిగిందంటే?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో నరేష్ ఒకరు కాగా ఈ షో ద్వారా నరేష్ భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారు. బిగ్ బాస్ షో సీజన్7లో నరేష్ కు ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో నరేష్ తన లవర్ ను పరిచయం చేశారు. ప్రోమోలో రష్మీ నేను విన్నది నిజమేనా అని నరేష్ ను అడగగా నరేష్ వెంటనే యస్ అని చెబుతాడు.

ఆ సీక్రెట్ ను నేనే చెప్పేస్తానని ఇన్నిరోజులు చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశానని నాకూ ఒక లవర్ ఉందని నరేష్ చెప్పగా నరేష్ లవర్ స్టేజ్ పైకి వచ్చారు. నరేష్ లవర్ మాట్లాడుతూ నరేష్ ను ఎక్స్ ప్రెస్ చేయలేనంత లవ్ చేశానని గడిచిన 2 సంవత్సరాలలో అంత ప్రేమను ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నరేష్ రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశారు. నరేష్ (Jabardasth Naresh) ఐ లవ్ యూ అని చెప్పడంతో పాటు ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నారు.

అయితే ఈ ప్రోమో చూసిన వాళ్లు నరేష్ లవ్ స్టోరీ స్క్రిప్టెడ్ అని చెబుతున్నారు. రేటింగ్స్ కోసం నరేష్ లవ్ ట్రాక్ ను షో నిర్వాహకులు ప్లాన్ చేసి ఉండవచ్చని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పంచ్ ప్రసాద్ సైతం ఈ ఎపిసోడ్ ద్వారా టీవీ షోలలోకి రీఎంట్రీ ఇచ్చారు. డిసెంబర్ నెల 3 వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ షో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటోంది. హైపర్ ఆది, రష్మీ ఈ షో సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. మరోవైపు రష్మీ ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రష్మీ వయస్సు ప్రస్తుతం 35 సంవత్సరాలు కాగా త్వరలో రష్మీ పెళ్లికి సంబంధించిన తీపికబురు చెప్పాలని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus