అల్లు శిరీష్ సినిమాలో అవకాశం అందుకొన్న జబర్డస్త్ పాప

ఈటీవీలో ప్రతివారం ప్రసారమయ్యే “జబర్డస్త్” షో గురించి, ఆ షోలో నటించేవారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ షోతో పాపులారిటీ సంపాదించుకొన్న నటులందరూ ఆల్మోస్ట్ సినిమాల్లో సెటిల్ అయిపోగా ఇంకొందరేమో ఈటీవీలోనే లేదా బయట చానల్స్ లో పలు రకాల షోలు చేస్తూ సినిమాలో ఆర్టిస్టులకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ దీవెన కూడా వచ్చి చేరింది.

అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎ బి సి డి” చిత్రంలో అల్లు శిరీష్ ఫ్రెండ్ గా దీవెన నటిస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అల్లు శిరీష్ ప్రకటించాడు. జబర్డస్త్ షో ద్వారా దీవెన విశేషమైన క్రేజ్ సంపాదించుకొంది. కేవలం ఆ చిన్నారి చెప్పే చిన్ని చిన్ని మాటల కోసమే షో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి బిజీ అయిపోయిన నటీనటులు బోలెడుమంది ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాతో దీవెన పాపులారిటీ ఇంకాస్త పెరిగిపోవడం ఖాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus