జబర్దస్త్ పెళ్లిళ్లు..!
- April 26, 2016 / 08:14 AM ISTByFilmy Focus
కళ్యాణమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదంటారు. “జబర్దస్త్” షో కమెడియన్ల విషయంలో ఆ నానుడి నిజమేనేమో అనిపిస్తుంది. ఈ కామెడీ షోలోని టీమ్ లీడర్లందరూ వరుసబెట్టి పెళ్ళిళ్ళు చేసేసుకొని.. ఒకింటివారవుతున్నారు.
గత ఆరు నెలలుగా కేవలం జబర్దస్త్ షోలో మాత్రమే కాకుండా చంటి ఎక్కడ కనబడినా అందరూ అడిగిన ఒకే ఒక్క ప్రశ్న “చంటికి పెళ్లి అవ్వదా?”. మరి అందరూ అలా అడుగుతున్నారని ఫీల్ అయ్యాడో లేక.. ఏజ్ దాటిపోతోందనుకొన్నాడొ తెలియదు కానీ.. ఇమ్మీడియట్ గా పెద్దలు కుదిర్చిన అమ్మాయిని వివాహమాడాడు. ఇక షకలక శంకర్ కూడా తన మేనమామ కూతురైన పార్వతిని చాలా నిరాడంబరంగా వివాహమాడాడు. సందులో సడేమియా అన్నట్లు మిగతా జబర్దస్త్ కమెడియన్లు, టీమ్ లీడర్లు కూడా వివాహానికి సిద్ధమవుతున్నారు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














