Jabardasth: జబర్దస్త్ షోకి ఎండ్ కార్డ్ పడనుందా…అదే కారణమా?

బుల్లితెర పై ఎంతో మంచి సక్సెస్ అయిన కామెడీ షోలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ షో గత పది సంవత్సరాలుగా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా పరిచయమై ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలు డైరెక్టర్లు కొనసాగుతూ ఉన్నారు. ఇలా బుల్లితెరపై అత్యధిక రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నటువంటి ఈ కార్యక్రమానికి త్వరలోనే ఎండ్ కార్డు పడపోతుందని తెలుస్తోంది.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం క్లోజ్ కానుందనే వార్త తెలియడంతో అందరూ కంగారు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ షో ఆపివేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమెడియన్స్ తమ కామెడీ స్కిట్ల ద్వారా ప్రేక్షకులను సందడి చేసేవారు. జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించేవారు అలాగే ఈ కార్యక్రమంలో హైపర్ ఆది స్కిట్లు భారీగా ప్రేక్షకులను ఆకట్టుకునేవి

ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమం విషయానికి వస్తే ఈ కార్యక్రమంలో రష్మీ యాంకర్ గా వ్యవహరించగా సుడిగాలి సుదీర్ స్కిట్లు అద్భుతంగా ఉండేవి ఇలా వీరి స్కిట్ల ద్వారా ఈ కార్యక్రమానికి మంచి రేటింగ్ కూడా వచ్చేది. అయితే ప్రస్తుతం జబర్దస్త్ నుంచి సుడిగాలి సుదీర్ హైపర్ ఆది తప్పకున్నారు. ఇక అనసూయ కూడా యాంకర్ గా తప్పకున్నారు.

అలాగే ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరిస్తున్నటువంటి నాగబాబు రోజా కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఇంద్రజ కుష్బూ వంటి వారు ఈ కార్యక్రమానికి జడ్జెస్ గా వస్తున్నారు. ఇలా స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమ రేటింగ్ పూర్తిగా పడిపోయిందని తెలుస్తుంది. ఇలా ఈ కార్యక్రమానికి ఏమాత్రం ఆదరణ లేకపోవడంతోనే ఈ కార్యక్రమానికి ముగింపు పలకాలని మల్లెమాలవారు భావించినట్టు తెలుస్తుంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus