‘జబర్దస్త్’ ఫ్యూచరేంటో.. అందరూ జంప్?

‘జబర్దస్త్’ టెలివిజన్ రంగంలో ఎన్నో రికార్డులు సృష్టించిన షో. ఈ షో ద్వారా ఎంతో మంది సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. అనసూయ, హైపర్ ఆది, షకలక శంకర్.. ఇలా ఎంతో మంది సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంత మెగా బ్రదర్ అయినప్పటికీ నాగబాబు ఈ షో తోనే ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. షోలో ఈయన నవ్వు, అలాగే ఆర్టిస్ట్ లకు మంచి సలహాలు ఇస్తూ వారిని ఎంకరేజ్ చేసే వాడు.

అయితే మరో రెండు వారాల్లో ఈయన ఈ షోకి గుడ్ బై చెప్పబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ ‘జీ తెలుగులో.. ‘లోకల్ గ్యాంగ్స్’ పేరుతో రాబోతున్న షోకి ఈయన జంప్ అవుతున్నాడట. ‘జబర్దస్త్’ షో నిర్వాహకులతో ఈయనకి గొడవలు రావడమే దీనికి కారణం అని కొందరు చెప్పుకొస్తున్నారు. అలాగే యాంకర్ అనసూయ కూడా జంప్ అవ్వబోతుందని తెలుస్తుంది. హైపర్ ఆది తో సహా మరికొంత మంది ‘లోకల్ గ్యాంగ్స్’ కు జంప్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా అయితే ‘జబర్దస్త్’ ఫ్యూచర్ సంగతి ఏంటి అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus