రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) భర్త.. ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)… తాను నిర్మించిన స్టార్ హీరోల సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ హీరోలైన అక్షయ్‌కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff).. లతో ‘బడే మియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan) అనే భారీ బడ్జెట్ సినిమా నిర్మించారు జాకీ భగ్నానీ. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి తోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా వల్ల జాకీ భగ్నానీకి భారీ నష్టాలు వచ్చాయట.
ఈ సినిమా కోసం ఆస్తులు సైతం తాకట్టు పెట్టాల్సి వచ్చిందని రివీల్ చేసి తన బాధని వెళ్లగక్కాడు. అతను మాట్లాడుతూ… ” ‘బడే మియా చోటే మియా’ సినిమా ఫలితం మాకు పెద్ద షాకిచ్చింది.పెద్ద గుణపాఠం కూడా నేర్పింది.భారీ బడ్జెట్ పెట్టినా సినిమా ఫలితం కరెక్ట్ గా అనుకున్నట్టు వస్తుందని అనుకోవడం కూడా మూర్ఖత్వం అని తెలిపాడు.ఆ సినిమా కంటెంట్‌తో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. అది ఆలస్యంగా అర్థమైంది. ప్రేక్షకులను తప్పుబట్టడానికి లేదు.
వాళ్ళు ఎప్పుడూ కరెక్టే. భవిష్యత్తులో ఇలాంటి మిస్టేక్స్ మేము రిపీట్ చేయలేని విధంగా ‘బడే మియా చోటే మియా’ మమ్మల్ని సరైన మార్గంలో నడుస్తుంది అని సరిపెట్టుకున్నాం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 50 శాతం కూడా రికవరీ సాధించలేదు. మా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఈ సినిమాను నిర్మించాం. ఈ సినిమా నిర్మాణ దశలో మేము పడ్డ ఇబ్బందులు ఎవ్వరికీ తెలీదు.ఇప్పుడు ఆ విషయాలు చెప్పుకోవడం వల్ల కూడా ఏమీ కలిసొచ్చింది లేదు” అంటూ చెప్పుకొచ్చాడు జాకీ భగ్నానీ.