Jadi: తెలుగులోకి వస్తున్న ఒడియా హిట్‌ సినిమా.. టాలీవుడ్‌ ఆదరిస్తే.. వరుస కడతాయ్‌

తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గ్రేట్‌.. మన సినిమాలే కాదు, ఇతర పరిశ్రమల సినిమాలు కూడా చూసేస్తారు, హిట్ చేసేస్తారు. కొన్నిసార్లు అయితే మాతృక భాషలో కంటే మన దగ్గరే పెద్ద విజయం అందుకుంటున్నాయి. అయితే ఇలా వచ్చే సినిమాలు ఎక్కువగా సౌత్‌ నుండే ఉంటాయి. కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు ఇలా తెలుగులోకి వచ్చి విజయం అందుకున్నాయి. హిందీ నుండి కూడా వస్తాయి. విజయాలు సాధిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనట్లు ఓ ఒడియా సినిమా తెలుగులో డబ్ అయి విడుదల కాబోతోంది.

Jadi

అవును, మీరు చదివింది కరెక్టే. ఒడియా సినిమా ‘జడి’ ఇప్పుడు తెలుగులోకి డబ్బింగ్‌ అయి వస్తోంది. ఒడియాలో ఘన విజయం సాధించిన ‘జడి’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ పదానికి అర్థం ఒకవేళ అయితే అని అర్థం. దిబ్య జ్యోతి ఉదయ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సైలేంద్ర సమంతరాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా ప్రధాన పాత్రల్లో నటించారు.

కామెడీ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రచారాన్ని షురూ చేశారు. ఇటీవల గ్లింప్స్‌ను విడుదల చేశారు. దాని ప్రకారం చూస్తే.. ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కాలేజీ యువకుల మధ్య స్నేహం, అనుబంధాలతో ప్రారంభమయ్యే కథ.. ఆ తర్వాత ప్రేమ కథగా మారుతుంది. ఈ క్రమంలో స్నేహితుల మధ్య తలెత్తే విభేదాలు, సంఘర్షణలు సినిమాలో ఉంటాయి. తెలుగు వెర్షన్‌కు రాకేందు మౌళి పాటలు, మాటలు రాశారు.

ఇక ఇప్పటివరకు ఒడియా నుండి తెలుగులోకి వచ్చిన సినిమాలు చూస్తే.. గతంలో ‘సీతారామంక బహాఘర కలియుగరే’ అనే సినిమాలో 2017లో విడుదలైంది. ఇందులో సుమన్‌ ఓ పాత్రలో నటించారు. చాలా కాలం తర్వాత వస్తున్న ఈ ఒడియా డబ్బింగ్‌ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

 బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags