ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంటే రాజ్యానికి పట్టాభిషేకం లాంటిది. అలాంటి వేడుకకు కుల, మత, ప్రాంత, వర్గ బేధాలు లేకుండా అందర్నీ ఆహ్వానిస్తుంటారు. రేపు జరగబోయే జగన్ ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు మొదలుకొని ప్రధానమంత్రి మోడీ వరకూ అందరూ హాజరవుతున్నారు. ఈ వేడుకకు జగన్ తన సన్నిహితులను, స్నేహితులను, విరోధులను కూడా పిలిచాడు ఒక్క పవన్ కళ్యాణ్ ను తప్ప. అలాగని పవన్ కుటుంబం నుంచి ఎవర్నీ పిలవలేదని కాదు. చిరంజీవిని కూడా ఆహ్వానించాడు జగన్.
ఇలా అసలు 2019 ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా ఇన్వాల్వ్ అవ్వని చిరంజీవి లాంటి వ్యక్తిని పర్సనల్ గా ఇన్వైట్ చేసిన జగన్.. పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించకపోవడం వెనుక రీజన్ ఏమిటి అనేది తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఈ అంశం లేనిపోని చర్చలకు దారి తీసింది. ఎంత ప్రత్యర్ధి అయినా కూడా జగన్ ఇలా పవన్ ను ప్రమాణ స్వీకారోత్సవానికి పిలవకపోవడం అనేది తప్పే.