Jagan, Chiranjeevi: మెగాస్టార్ కు సమాధానం ఇచ్చిన సీఎం జగన్!

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం ఓటమి అనంతరం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ తరువాత సైలెంట్ గానే పాలిటిక్స్ కు దూరమయ్యారు. రాజకీయాలు ఏ మాత్రం సెట్టవ్వవని దూరమైన మెగాస్టార్ నాయకులకు జూడా దూరంగానే ఉంటున్నారు. అయితే కొన్నిసార్లు ఆయన అధికార నాయకులపై ప్రశంసలు కురిపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా నాయకులు కూడా మెగాస్టార్ చిరంజీవి స్పందనకు ప్రతిస్పందిస్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పాజిటివ్ కామెంట్స్ చేశారు.

ఒకేరోజు 13.72లక్షల మందికి వ్యాక్సిన్ వేయించడం ఒక అరుదైన రికార్డు అని జగన్ నాయకత్వం స్ఫూర్తిని కలిగిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.ఇక మెగాస్టార్ అలా కామెంట్ చేయగానే వైఎస్.జగన్ కూడా సమాధానం ఇచ్చారు. చిరంజీవి గారు, రాష్ట్ర ప్రభుత్వం తరపున, మీ ప్రశంసల మాటలకు ధన్యవాదాలు. ఈ క్రెడిట్ అంతా కూడా విలేజ్ / వార్డ్ సెక్రటేరియట్స్, వాలంటీర్స్, ఎఎన్‌ఎంలు, ఆశా కార్మికులు, పిహెచ్‌సి వైద్యులు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జెసిలు & కలెక్టర్లకు వెళుతుందని అన్నారు.

ఒకవైపు తమ్ముడు జనసేన పార్టీతో అధికార ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే మరోవైపు అన్నయ్య ఇలా పాజిటివ్ గా స్పందిస్తుండడంతో విభిన్నమైన వాతావరణం నెలకొన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus