Jagapathi Babu: ఇండస్ట్రీలో స్నేహితులపై జగపతి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించే సత్తా ఉన్న నటులలో జగపతిబాబు ఒకరు. అఖండ సినిమాతో జగపతిబాబు ఖాతాలో మరో సక్సెస్ చేరింది. హీరో సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటించగా ఈ సినిమా కూడా సక్సెస్ సాధించడం గమనార్హం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు ఇండస్ట్రీలోని స్నేహితుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సాధారణంగా ఒకే రంగంలో పని చేసేవాళ్లకు స్నేహితులు ఉంటారు. అయితే జగపతిబాబు మాత్రం ఇండస్ట్రీలో తనకు స్నేహితులు లేరని చెబుతున్నారు. తమిళ నటుడు అర్జున్ మాత్రమే తనకున్న జెన్యూన్ ఫ్రెండ్స్ లో ఒకరని జగపతి బాబు అన్నారు. చాలా సంవత్సరాల నుంచి తనకు, అర్జున్ కు మధ్య అనుబంధం ఉందని జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఫ్రెండ్ షిప్ వల్లే ఒకరి సినిమాలలో మరొకరు నటించడం జరిగిందని జగపతిబాబు తెలిపారు.

అయితే అర్జున్ కు, తనకు మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయని ఆ గొడవలను చూస్తే తాము ఫ్రెండ్స్ లా కాకుండా శత్రువులుగా కనిపిస్తామని జగపతిబాబు అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం తనకు ఎవరూ ఫ్రెండ్స్ కాదని జగపతిబాబు వెల్లడించారు. ఎవరి గురించైనా ఫ్రెండ్ అని చెప్పాలని అనుకుంటే అవతలి వ్యక్తుల ప్రవర్తన గుర్తుకురావడంతో వాళ్లను స్నేహితులు అనాలని తనకు అనిపించదని జగపతిబాబు తెలిపారు. సినిమా రంగంలో ఉండే స్నేహితులు బాత్ గయా రాత్ గయా టైప్ లో ఉంటారని జగపతి బాబు చెప్పుకొచ్చారు.

జగపతి బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక్కో సినిమాకు జగపతిబాబు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు క్లాస్ పాత్రలతో పాటు మాస్ పాత్రలలో కూడా అద్భుతంగా నటించి మెప్పిస్తూ ఉండటం గమనార్హం. దర్శకుడు బోయపాటి శ్రీను జగపతిబాబుకు ఎక్కువగా ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం. క్రూరమైన విలన్ పాత్రలను సైతం జగపతిబాబు అద్భుతంగా పోషిస్తున్నారు. హీరో పాత్రలకు జగపతిబాబు పూర్తిగా దూరం కావడం గమనార్హం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus