జగపతిబాబు (Jagapathi Babu), సౌందర్య (Soundarya) కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. జగపతిబాబు, సౌందర్య మధ్య మంచి స్నేహం ఉండేది. సౌందర్య 20 సంవత్సరాల క్రితం హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెంది అభిమానులకు బాధను మిగిల్చారు. సౌందర్య మరణం అప్పట్లో ఎంతోమంది ఫ్యాన్స్ ను బాధ పెట్టింది. అయితే జగపతిబాబు తాజాగా ఒక సందర్భంలో సౌందర్య మరణం గురించి కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సౌందర్య మరణం గురించి జగపతిబాబు రియాక్ట్ అవుతూ నేను ఫిలాసఫీని ఎక్కువగా బిలీవ్ చేస్తానని కామెంట్లు చేశారు. నా బుర్రలో ఎప్పుడూ అదే ఉంటుందని పుడతామని మరణిస్తామని అందరికీ తెలుసని జగపతిబాబు చెప్పుకొచ్చారు. లైఫ్ లో డబ్బును పోగొట్టుకుంటే సంపాదించుకునే ఛాన్స్ ఉంటుందని మనిషిని కోల్పోతే మాత్రం సంపాదించుకోలేమని ఆయన అన్నారు. మనిషి చనిపోతే ఖచ్చితంగా బాధ పడతామని అయితే ఏడవాలనే నిబంధన లేదు కదా అని జగపతిబాబు పేర్కొన్నారు.
సౌందర్య, ఆమె సోదరుడు మరణించిన సమయంలో ఆమె కుటుంబ సమస్యల గురించే నేను ఎక్కువగా ఆలోచించానని ఆయన అన్నారు. జగపతిబాబు దృష్టి కోణం ప్రకారం ఆయన చెప్పింది కూడా రైటేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. జగపతిబాబు ప్రస్తుతం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు. జగపతిబాబు రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉండటం గమనార్హం.
జగపతిబాబు ఖాతాలో మరిన్ని భారీ విజయాలు చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జగపతిబాబు కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ ఏడాది విడుదలైన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో జగపతిబాబు నటించగా ఆయన పాత్రపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. జగపతిబాబు కీలక పాత్రలో నటిసున్న సలార్2 (Salaar) కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.