ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొని పెద్దాయన గురించి, చంద్రబాబు నాయుడు గురించి, బాలకృష్ణ గురించి మాట్లాడారు. ముగ్గురినీ ఆకాశానికెత్తిన రజనీకాంత్… చంద్రబాబు నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతారు అంటూ రాజకీయాలు కూడా మాట్లాడారు. ఆయన ఎందుకు మాట్లాడారు, ఏ ఆలోచనతో మాట్లాడారు అనేది వేరే విషయం. అయితే ఆయన మీద ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిపై అన్ని వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి.
తాజాగా ఈ విషయంలో జగపతిబాబు మాట్లాడారు. ‘‘నేను టీవీలు చూడను, పత్రికలు చదవను. దాంతో రజనీకాంత్ ఏం మాట్లాడారు? ఎవరిని విమర్శించారనే విషయంలో నాకు అవగాహన లేదు. అయితే రజనీకాంత్ ఎప్పుడూ నవ్విస్తూ, చక్కగా నిజాలు మాట్లాడతాడు. తనని అనేవాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. పట్టించుకోవల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. దీంతో రజనీ విషయంలో బేషరుతుగా రజనీకాంత్‌కి జగపతిబాబు సపోర్టు చేసినట్లు అయ్యింది. దీంతో ఇప్పుడు జగపతిబాబు ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజనీకాంత్ వైఎస్‌ఆర్‌సీపీని, సీఎం వైఎస్ జగన్‌ను పల్లెత్తు మాట అనకపోయినా.. చంద్రబాబును పొగిడారు అనే మాట పట్టుకుని జగన్ పార్టీ నాయకులు మీడియా ముందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడ్డారు. సిల్క్ స్మిత వ్యవహారాన్ని ఇప్పుడు బయటకు తీసి.. రజనీ క్యారెక్టర్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో టీడీపీ నాయకుల నుండి ప్రతిఘటన ఎదురవుతున్నా, తటస్థుల నుండి కూడా రజనీకే మద్దతు వస్తున్నా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తగ్గడం లేదు.
రజినీకాంత్‌తో (Jagapathi Babu) జగపతిబాబు ‘కథానాయకుడు’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సమయంలో రజినీకాంత్ కలిసి నటించడంపై జగపతిబాబు ఎమోషనల్ అయ్యాడు కూడా. ఇప్పుడు తన స్నేహితుడికి బాసటగా నిలిచారు అని చెప్పాలి. దీంతో ఇక ఇండస్ట్రీలో ఎవరెవరు స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రజనీకాంత్‌కి చాలామంది స్నేహితులు ఇక్కడ ఉన్నారు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా