తెలుగు సినిమాలు లేదంటే తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చే సినిమాలకు బాలీవుడ్ టాక్ షోల్లో ప్రాతినిధ్యం ఒకప్పుడు తక్కువగా ఉండేది. అయితే లాక్‌డౌన్ – కరోనా పరిస్థితుల తర్వాత మొత్తం సిట్యువేషన్ మారిపోయింది. సౌత్ సినిమా పరిశ్రమలో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలకు బాలీవుడ్ ప్రచారం చేస్తున్నారు. అలా ‘మిరాయ్’ సినిమా కోసం టీమ్ ప్రచారం చేయడానికి కపిల్ శర్మ షోకి వెళ్లింది. ఈ క్రమంలో జగపతిబాబు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
టాలీవుడ్ హీరోగా, ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు జగపతి బాబు. ‘మిరాయ్’ సినిమాలో ఆయన కూడా ఓ భాగం కావడంతో ఆయన కూడా ఆ టాక్ షోకి వెళ్లారు. ఈ క్రమంలో హోస్ట్ కపిల్ శర్మ.. జగపతిబాబును ఇంట్రడ్యూస్ చేస్తూ ‘జగపతిబాబును మీరు చాలా సినిమాల్లో చూశారు. అన్ని రకాల పాత్రలు చేయగలరు.. ఆయన రసం (డిష్) లాంటి వారు’ అని సంభోదించారు. దానికి జగపతిబాబు తాను రసం కాదని.. సాంబారు లాంటివాడినని అన్నారు. అందులో అన్నీ కలసి ఉంటాయని, పైసా వసూల్ అని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి.
అలాగే మీరు 170కిపైగా సినిమాలు చేశారు కదా.. ఆ పేర్లు చెబుతారా అని కపిల్ శర్మ అడిగితే మంచి మనుషులు, సింహ స్వప్నం, అడవిలో అభిమన్యుడు, పెద్దరికం, జగన్నాటకం, శుభాకాంక్షలు, శుభలగ్నం.. అంటూ ఓ లిస్ట్ చెప్పి.. మధ్యలో చెప్పేసి నేను ఏం పేర్లు చెప్పినా ఓకే ఎందుకంటే మీకు అవి తెలియవు అని సెటైర్ వేశారు జగపతి. పక్కనే ఉన్న తేజ సజ్జా మధ్యలోకి వచ్చిన జగపతిబాబు రొమాంటిక్ కింగ్ అని ఆయనకు ఇక్కడున్న ఇమేజ్ గురించి చెప్పుకొచ్చారు. దీంతో షో అంతా నవ్వులు విరిశాయి. ఇదంతా ఆ ఎపిసోడ్ ట్రైలర్ మాత్రమే. ఫుల్ ఎపిసోడ్‌లో ఇలాంటివి చాలా ఉండనున్నాయి. చూద్దాం ఎవరేం చెప్పారో?