జాగ్వార్

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నిర్మాత కుమారస్వామి తన తనయుడు నిఖిల్‌ కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘జాగ్వార్’. ఎ.మహదేవ్‌ దర్శకత్వంలో హై టెక్నికల్‌ వాల్యూస్‌తో, 75 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుకగా నేడు తెలుగు, కన్నడ భాషలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సంపత్‌, ఆదిత్యమీనన్‌, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా నిఖిల్‌ కుమార్‌ కి ఎలాంటి విజయాన్ని అందించనుందో ఒకసారి చూద్దామా!

కథ : మెడిసిన్ చదివే ఓ కుర్రాడు కృష్ణ(నిఖిల్ కుమార్). ఉదయం వేళల్లో అందరిలానే చాలా సరదాగా ఉండే కృష్ణ… అర్థరాత్రి సమయంలో మాత్రం ఓ టీవీ ఛానెల్ ను హ్యాక్ చేసి, మాస్క్ వేసుకొని పలు హత్యలు చేస్తుంటాడు. ఈ హత్యలను ఆ టీవీ ఛానెల్ లో లైవ్ గా వచ్చేలా చేస్తుంటాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఆ కేసును డీల్ చేయడానికి సీబీఐ ఆఫీసర్‌ జగపతి బాబు ను నియమిస్తుంది. దీంతో అసలు కథ మొదలవుతుంది. అసలు కృష్ణ ఇలా వరుసగా ఎందుకు హత్యలు చేస్తున్నాడు? ఆ హత్యల వెనుక ఉన్న కారణం ఏంటి? ఈ హత్యలను లైవ్ లో ఎందుకు చూపిస్తున్నాడు? చివరకు ఏం జరిగింది అనేది వెండితెర మీద చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : తొలిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కుమార్ డాన్సులు, యాక్షన్ సీన్లలో మెరిపించాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్ లలో దుమ్మురేపేసాడు. కానీ నటన విషయంలో మరింత శిక్షణ తీసుకుంటే బాగుండేది. మొత్తానికి నిఖిల్ కుమార్ పర్వాలేదనిపించాడు. ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర హైలెట్ గా చెప్పుకోవచ్చు. తన పాత్రలో రావు రమేష్ ఒదిగిపోయాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రావు రమేష్ తనదైన నటనతో కట్టిపడేసాడు. ఇక సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించిన జగపతి బాబు బాగా చేశాడు. చాలా స్టైలిష్ గా కనిపించాడు. హీరోయిన్ దీప్తి సతి కేవలం గ్లామర్ కే పరిమితమయ్యింది. దీప్తి సతి తన క్యూట్ లుక్స్ తో మెప్పించింది. కానీ హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ బాలేదు. మరీ సాగదీసినట్లుగా అనిపిస్తోంది. ఇక రమ్యకృష్ణ, సంపత్‌, ఆదిత్యమీనన్‌, సుప్రీత్‌ రెడ్డి, బ్రహ్మానందం తదితరులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. ఇందులో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ మరియు క్లైమాక్స్ సీన్లు బాగున్నాయి. ఇక సినిమా మొదటి పది నిమిషాల యాక్షన్ ఛేజింగ్ సీన్, అలాగే ఓ కార్ ఎపిసోడ్ నేపథ్యంలో వచ్చే సీన్లు బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. కానీ ఇందులో చాలా చోట్ల లాజిక్ లు మిస్ అయ్యాయి. పైగా విలన్ పాత్ర కూడా స్ట్రాంగ్ గా లేదు. ఇలాంటి కమర్షియల్ చిత్రాల్లో కామెడి ఉండాలనే ఉద్దేశ్యంతో సెకండ్ హాఫ్ లో కామెడి సీన్స్ ను అనవసరంగా పెట్టినట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ కామెడి కూడా సరిగా అలరించలేదు.

సాంకేతికవర్గం పనితీరు : ‘జాగ్వార్’ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ బాగుంది. కథలో దమ్మున్నప్పటికి కథనం అంతగా లేనట్లుగా అనిపిస్తోంది. పవర్ ఫుల్ కథకు దర్శకుడు మహదేవ్ సరైన స్క్రీన్ ప్లేను అందించడంలో విఫలమయ్యాడు. కానీ దర్శకుడిగా మాత్రం మహదేవ్ పర్వాలేదనిపించాడు. ఇక మనోజ్ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ అధ్బుతం.విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా చూపించాడు. అందమైన లోకేషన్లలో చిత్రీకరించారు. సినిమా మూడ్ ను బాగా పెంచేసాడు. తమన్ అందించిన పాటలు అస్సలు బాగోలేవు. ‘అందానికి సెల్ఫివే…’ అనే పాట తప్ప మరేం అలరించలేకపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా) కంపోజ్ చేసిన యాక్షన్ సీన్లు చాలా బాగున్నాయి. తమన్నా పాట అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ బాగుంది. చివరగా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారు.

విశ్లేషణ : ‘జాగ్వార్’ విడుదలకు ముందు భారీ అంచనాలను ఏర్పడటంతో ప్రేక్షకులు భారీగా ఊహించేసుకున్నారు. కానీ ఆ స్థాయిలో సినిమా చేరుకోలేకపోయింది. కానీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘జాగ్వార్’ బాగా నచ్చుతుంది. మొత్తానికి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘జాగ్వార్’ జస్ట్ ఓకే.

Rating : 2/5

Click Here For English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus