‘జైబాలయ్య’తో మార్మోగిన జనతా గ్యారేజ్!!!

జై బాలయ్య….జై ఎన్టీఆర్….ఈ రెండు పదాలు ఇప్పుడే కాదు…ఎప్పటికీ తెలుగు వారి గుండె చప్పుళ్లు. అయితే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాల కృష్ణ ఇద్దరూ నందమూరి అభిమానులకి రెండు కళ్ళు అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిదీ పెద్దాయన వారసత్వమే కాబట్టి. అయితే ఏమయిందో ఏమో తెలీదు. రాజకీయ కారణాలు ఇబ్బంది పెడుతున్నాయో, లేక వ్యక్తిగత విషయాలు అభిమానులను కలవార పెడుతున్నాయో కానీ, చివరకు ఎన్టీఆర్ కు, బాలయ్యకు మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది అనేది మాత్రం ఒప్పుకోక తప్పని నిజం.
అయితే గతంలో ఒక సినిమాను బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ సినిమాపై కాస్త నెగేటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని టాక్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఎన్టీఆర్ కి తెలుగుదేశంలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని సైతం కాస్త ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్న విషయం. ఇదిలా ఉంటే నిన్న విడుదలయిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా పుణ్యమా అని ఎన్టీఆర్-బాలయ్య ఫ్యాన్స్ కనలిపోయారు.
ఈ చిత్రం బెనిఫిట్ షోలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వెయ్యడంతో…కొన్ని చోట్ల బాలయ్య ఫ్యాన్స్ హల్ చల్ చేశారు.  సాధారణంగా ఈ షోలకు తారక్ వీరాభిమానులు వస్తారు. కానీ ఈసారి వారితోపాటు బాలయ్య అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి సినిమా ప్రారంభం అయిన దగ్గర నుంచి జై బాలయ్యా… జై జై బాలయ్యా అంటూ నినాదాలు చేశారు. దీంతో తారక్ ఫ్యాన్స్ సైతం జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు అందుకున్నారు. ఒకటి, రెండు కాదు….చాలా థియేటర్స్ లో ఇదే పరిస్థితి. ఇలా మొత్తానికి మన నందమూరి అభిమానులు కలసిపోయి సినిమా చూడడం విశేషం.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus