మొన్న టీజర్…నిన్న స్టోరీ…నేడు ఇంటర్వెల్ సాంగ్ లీక్!
- July 31, 2017 / 10:43 AM ISTByFilmy Focus
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్స్ తో దూసుకొస్తున్నాడు…ఒకటి కాదు రెండు కాదు…వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ తన స్టామినాని పర్ఫెక్ట్ గా చూపించే కధతో త్రిపాత్రాభినయమ్ చేస్తూ మన ముందుకు వస్తున్న సినిమా “జై లవకుశ”. అయితే అదే క్రమంలో ఈ సినిమాపై హైప్ రోజురోజుకీ పెరిగిపోతూ ఉండడంతో ఈ సినిమా విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి…ఇందులో మొదటిగా చూసుకుంటే…ఆ మధ్య టీజర్ సన్నివేశాల లీక్ అయ్యాయి…ఇక ఆ లీక్ కు కారణమైన గణేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఇది చాలా పాత కధ ఎందుకంటే…గత రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలు వింటూ ఉంటే… ఈ సినిమా స్టోరీ లైన్ సైతం లీక్ అయ్యింది అని మన చూశాం…ఇక ఆ స్టోరీ లైన్ వినగానే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తిని మరింత పెంచుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్…ఇక నిన్నటితో ఆ కధ ముగిసింది అని అనుకోగానే….తాజాగా ఈ సినిమాకు సంభందించి మరో ట్విష్ట్ ఒకటి బయటపడింది…అదేంటి అంటే…జై లవకుశ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ లీక్ అయ్యిందని సమాచారం…అంతేకాదు…ఆన్ లైన్ లో ఆ వీడియో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు పాత్రల్లోని జై పాత్ర కోసం ఈ పాటను కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. మరి లీక్ ల బాగోతం ఇక్కడితో ఆగుతుందో లేక ఇంకా ఇలానే కొనసాగుతూ సినిమాని ఇబ్బందులకు గురి చేస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















