సినిమాను హిట్ ఎందుకు చేస్తారో, ఫ్లాప్ ఎందుకు చేస్తారో ప్రేక్షకులకు ఓ లెక్క ఉంటుంది. అందరికీ ఓ సినిమా నచ్చాలని లేదు, అందరికీ ఓ సినిమా నచ్చకూడదు అని లేదు. అయితే ఎక్కువమందికి నచ్చిన సినిమా హిట్ అంటారు, ఎక్కువమందికి నచ్చని సినిమాను ఫ్లాప్ అంటారు. అయితే ఈ హిట్టు, ఫ్లాపు సినిమా కాన్సెప్ట్ హాల్స్‌కు, ఓటీటీకి వేర్వేరుగా ఉంటుందా? ఏమో రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలను చూసి నెటిజన్లు ఈ మాటే అంటున్నారు.
ఇటీవల కాలంలో తెలుగులో మంచి విజయం అందుకున్న చిన్న సినిమా ఏదీ అంటే… ‘బేబీ’ అని చెబుతారు. చాలా చాలా చిన్న సినిమాగా మొదలై సుమారు రూ. 90 కోట్లు వసూలు చేసిన చిత్రమిది. ఇక తమిళనాట ఇటీవలకాంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఏదీ అంటే… ‘జైలర్’ అని ఈజీగా చెప్పేయొచ్చు. ఆ సినిమాకు రూ. 600 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఆ ఆనందాన్ని నిర్మాత గిఫ్ట్‌ల రూపంలో, డబ్బుల రూపంలో టీమ్‌తో పంచుకుంటున్నారు కూడా. అయితే ఈ రెండు సినిమాలకు ఓటీటీలో అంత మంచి స్పందన లేదు అంటున్నారు.
థియేటర్ ఆడియన్స్, ఓటీటీ ఆడియన్స్… ఈ ఇద్దరికీ చాలా తేడా ఉంది అనేది ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇప్పుడు ‘జైలర్’, ‘బేబీ’ సినిమాలు చూశాక అదే మాట మళ్లీ అంటున్నారు. ఫక్తు కమర్షియల్ కథను కాస్త సీనియర్ స్టార్ హీరో ఎలిమెంట్ జోడించి తెరకెక్కించిన సినిమా ‘జైలర్’. ఇక సెన్సిబుల్ పాయింట్‌తో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘బేబీ’. అయితే ఈ రెండు పాయింట్లు థియేటర్లలో జనాలకు నచ్చాయి కానీ ఓటీటీలో కాదు అంటున్నారు.
కొంతమంది అయితే ఏముందని (Jailer) ‘జైలర్’ సినిమాలకు రూ. 600 కోట్లు వచ్చాయి అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత హాఫ్ కుక్‌డ్ సినిమాకు అంతటి హైప్ ఇచ్చారా అంటూ ‘బేబీ’ సినిమాను అంటున్నారు. మరికొందరు అయితే సినిమాలు అదరొట్టాయి అని కూడా చెబుతున్నారు. ఇంకొందరు అయితే ‘జవాన్’ లాంటి కమర్షియల్ సినిమాకు కూడా రేపొద్దున ఓటీటీలో ఇదే పరిస్థితి అంటూ జోస్యం చెబుతున్నారు.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!