సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. ‘వరుణ్ డాక్టర్’ ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత అయిన సునీల్ నారంగ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు కలిసి రిలీజ్ చేశారు.
ఇక ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ రావడంతో ‘జైలర్’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.వీక్ డేస్ లో కూడా ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది, నిన్న కూడా ఈ మూవీ కోటి పైనే కలెక్ట్ చేసింది.ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 15.40 cr |
సీడెడ్ | 4.37 cr |
ఉత్తరాంధ్ర | 4.28 cr |
ఈస్ట్ | 2.19 cr |
వెస్ట్ | 1.27 cr |
గుంటూరు | 2.32 cr |
కృష్ణా | 1.96 cr |
నెల్లూరు | 0.98 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 32.84 cr |
‘జైలర్’ (Jailer) చిత్రానికి తెలుగులో రూ.11.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.12.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.32.84 కోట్ల షేర్ ను రాబట్టింది.
3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ.. 8 రోజుల్లో రూ.20.64 కోట్ల భారీ లాభాలను అందించింది.పోటీగా చిరంజీవి ‘భోళా శంకర్’ ఉన్నా ‘జైలర్’ ఈ రేంజ్ లో కలెక్ట్ చేస్తుండటం అంటే మామూలు విషయం కాదు.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?